For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మురళి విజయ్ ప్రపోజల్‌‌పై స్పందించిన మహిళా క్రికెటర్

Australian Cricketer Gives Hilarious Response to Murali Vijays dinner request

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మురళి విజయ్ డిన్నర్ ప్రపోజల్‌పై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ తనదైన శైలిలో స్పందించింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన మురళి విజయ్.. ఆ మధ్య చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఎల్లీస్ పెర్రీ అందంగా ఉంటుంది..

ఎల్లీస్ పెర్రీ అందంగా ఉంటుంది..

అయితే ఈ లైవ్ సెషన్ సందర్భంగా ఓ అభిమాని.. ఏ క్రికెటర్‌తో డిన్నర్ చేయాలని ఉందని ప్రశ్నించగా.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ, తన సహచర ఓపెనర్ శిఖర్ ధావన్‌ పేర్లను విజయ్ సూచించాడు. అంతేకాకుండా ఎల్లిస్ పెర్రీ చాలా అందంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘ఎల్లిస్ పెర్రీతో డిన్నర్ చేయాలనుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇక ఎప్పుడైన శిఖర్ ధావన్‌తో ఒకే'అని విజయ్ సమాధానమిచ్చాడు.

ఇలానే డిన్నర్‌కు పిలిచి పెళ్లి చేసుకున్నావ్..

ఇలానే డిన్నర్‌కు పిలిచి పెళ్లి చేసుకున్నావ్..

అయితే ఎల్లీస్ పెర్రీపై తనకున్న క్రష్ మురళి విజయ్ బయటపెట్టడంతో ఈ వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. విజయ్ కామెంట్స్ కొందరు సరదాగా కామెంట్ మరికొందరు అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతూ ట్రోల్ చేశారు. ముఖ్యంగా తన సహచర ఆటగాడు దినేశ్ కార్తీక్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ‘ఇలానే దినేశ్ కార్తీక్ మొదటి భార్యను డిన్నర్‌కు పిలిచి పెళ్లి చేసుకున్నావ్.. మళ్లీ ఈమెను చేసుకుంటావా?'అని ఎగతాళి చేశారు. ఇంకొందరేమో.. ఎల్లీస్ పెర్రీ అందానికి విజయ్ దాసోహమయ్యాడని కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం అప్పట్లో హల్‌చల్ చేసింది.

విజయ్ బిల్ పే చేస్తే.. నాకు ఓకే..

అయితే విజయ్ కోరికను, డిన్నర్ ప్రపోజల్‌ను తాజాగా ఎల్లీస్ పెర్రీ ముందుంచగా.. తనదైన శైలిలో బదులిచ్చింది. తాజాగా సోనీ స్పోర్ట్స్ ఇండియా‌తో ముచ్చటించిన ఈ ఆసీస్ మహిళా క్రికెటర్.. విజయ్ డిన్నర్ ప్రపోజల్‌కు ఓకే చెప్పింది. కానీ బిల్ మాత్రం అతనే పే చేస్తాడని భావిస్తున్నట్లు పేర్కొంది. ‘ఆ డిన్నర్ బిల్ విజయ్ చెల్లిస్తాడనుకుంటున్నా. అతనేం వెనుకాడే మనిషి కాదు. అతని డిన్నర్ చేస్తే ఉబ్బితబ్బిబ్బవుతా.'అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి..

గాయంతో ఫైన‌ల్‌కు దూరం..

గాయంతో ఫైన‌ల్‌కు దూరం..

బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన పెర్రీ.. ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టింది. కానీ లీగ్ స్టేజీలో గాయపడి కీలక ఫైనల్ ముందు జట్టుకు దూరమైంది. ఇక భారత మహిళలతో జరిగిన నాటి ఫైనల్లో ఆసీస్ 85 పరుగులతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె మరో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉండనుంది. ఇక అత్యత్తుమ ప్రదర్శన విజ్డన్ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది.

ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ

Story first published: Sunday, May 3, 2020, 16:24 [IST]
Other articles published on May 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+