India vs Australia:టీమిండియా ప్రాక్టీస్ షురూ.. నెట్స్‌లో యార్కర్లతో బెంబేలెత్తించిన నట్టూ!

సిడ్నీ: బయో బబుల్‌ను దాటకుండా తమకు ఇచ్చిన వెసులు బాట్లను ఉపయోగించుకుంటూ.. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. ఐపీఎల్ అనంతరం విరామం తీసుకోకుండానే వచ్చిన పని కోసం సన్నాహకాలు స్టార్ట్ మొదలుపెట్టింది. దుబాయ్ నుంచి నేరుగా సిడ్నీ చేరుకున్న భారత ఆటగాళ్లకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరి ఫలితాలు నెగెటివ్‌గా రావడంతో ఆటగాళ్లు అవుట్‌డోర్ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. శనివారమే సాధన ప్రారంభించినా, తొలిరోజు జిమ్‌లో కసరత్తులు, రన్నింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. రెండోరోజైన ఆదివారం పూర్తిస్థాయిలో ఆటగాళ్లంతా సాధనకు దిగారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
నెట్స్‌లో నట్టూ..
సిడ్నీ ఒలింపిక్ పార్క్ మైదానంలో హార్దిక్ పాండ్యా, పృథ్వీ షా, హనుమ విహారి, చతేశ్వర్ పుజారా, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్, పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్ వార్మప్ చేస్తూ జాలీగా కనిపించారు. ఐపీఎల్ పెర్ఫామెన్స్‌తో అవకాశం అందుకున్న కొత్త ఆటగాళ్లు నటరాజన్, దీపక్ చహర్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తొలిసారి భారత జట్టులోకి ఎంపికైన ఎడంచేతి వాటం పేసర్ నటరాజన్ తెల్లబంతులతో టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేశాడు. యార్కర్లతో బెంబేలెత్తించాడు. అతను అదనంగా బౌలింగ్ చేశాడు. అతని ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.

కోహ్లీ, పుజారా..
టెస్ట్ ఆటగాళ్లు కూడా జట్టుతోనే ఉండడంతో నెట్స్‌లో అటు తెల్లబంతులతోపాటు ఇటు ఎర్ర బంతులతోనూ సాధన చేశారు. టెస్ట్‌ల్లో స్లిప్పులో ఫీల్డింగ్ చేసే కెప్టెన్ కోహ్లీ, పుజార క్యాచ్‌ల ప్రాక్టీస్ చేశారు. ఇందులో భాగంగా.. కుడివైపునకు డైవ్ చేసిన విరాట్ ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం అబ్బురపరిచింది. ఈ స్ఫూర్తితో పుజార కూడా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని డైవ్ చేస్తూ క్యాచ్‌గా అందుకున్నాడు. నవంబర్ 27న సిడ్నీలో జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆసీస్‌తో భారత్ 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడనుంది.

కోహ్లీసేనకు తప్పిన ముప్పు..
భారత క్రికెటర్లు సాధన చేస్తున్న సిడ్నీ మైదానానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలోని క్రోమెర్ క్రికెట్ పార్క్‌లో ఆదివారం ఓ మినీ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. విమానంలోని ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆ క్రికెట్ క్లబ్‌లో 12 మంది ఆటగాళ్లు ఉన్నారు. విమానం పొగలు కక్కుతూ మంటలతో పార్క్‌వైపు దూసుకొస్తుండడాన్ని గమనించిన క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షుడు గ్రేగ్ అక్కడున్న వారిని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అనుష్క శర్మ పెంపుడు కుక్క ‘విరాట్ కోహ్లీ'.. కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్యలు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications