Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia:ప్చ్..సిరీస్‌ ప్రారంభానికి ముందే కరోనా కలవరం..సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఆసీస్ కెప్టెన్

Australia Test captain Tim Paine among players in self-isolation due to Coronavirus outbreak in Adelaide

సిడ్నీ: ఆస్ట్రేలియాలో మళ్లీ కరోనా వ్యాప్తి చెందుతుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. సోమవారం అడిలైడ్‌లో కొత్తగా 17 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. ఏప్రిల్ తర్వాత మళ్లీ ఆ దేశంలో కరోనా ఉధృతి కనిపిస్తోంది. దాంతో భారత్‌తో జరిగే క్రికెట్ సిరీస్‌లపై గందరగోళం నెలకొంది. కరోనా కేసులు పెరుగుతున్నా షెడ్యూల్ ప్రకారమే క్రికెట్ మ్యా‌చ్‌లు జరుపుతామని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసీస్ టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ సహా మిగతా ఆటగాళ్లంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

కరోనా పరీక్షలు..

కరోనా పరీక్షలు..

కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో రేపు ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అడిలైడ్‌లోని ఓ క్వారంటైన్‌ హోటల్‌లో పనిచేసే వర్కర్‌ ద్వారా స్థానికంగా నివాసం ఉండే కుటుంబానికి కోవిడ్‌-19 సోకిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు పిలుపునిచ్చారు. స్కూళ్లు, షాపులు మూసివేస్తూ అందర్ని అలర్డ్ చేశారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాట్లాడుతూ.. దక్షిణ ఆస్ట్రేలియాలో కరోనా క్లస్టర్‌లో నమోదవుతున్న కేసులు తమకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని, అయితే విపత్కర పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే విషయంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.

ప్రేక్షకుల అనుమతిపై..

ప్రేక్షకుల అనుమతిపై..

కాగా అడిలైడ్‌లో కరోనా వ్యాప్తి టీమిండియా ఆస్ట్రేలియా టూర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే నెల 17 నుంచి అడిలైడ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య ఫస్ట్ డే-నైట్‌ టెస్టు జరగనుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 27,000 మంది ప్రేక్షకులకు అంటే స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రాక్టీస్ షురూ..

ప్రాక్టీస్ షురూ..

ఓవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తే మరోవైపు భారత ఆటగాళ్లు ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బయో బబుల్‌ను దాటకుండా తమకు ఇచ్చిన వెసులు బాట్లను ఉపయోగించుకుంటూ.. సన్నాహకాలను ప్రారంభించారు. శనివారమే సాధన ప్రారంభించినా, తొలిరోజు జిమ్‌లో కసరత్తులు, రన్నింగ్‌కు మాత్రమే పరిమితమయ్యారు. రెండోరోజైన ఆదివారం పూర్తిస్థాయిలో ఆటగాళ్లంతా సాధనకు దిగారు. ప్రస్తుతం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్న భారత ప్లేయర్లంతా ప్రాక్టీస్‌లో, జిమ్‌లో చెమటోడుస్తున్న ఫొటోలను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. 69 రోజుల ఈ సుదీర్ఘ పర్యటన‌లో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో 3 వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.

కరోనా తెచ్చిన కష్టం.. డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్!

Story first published: Monday, November 16, 2020, 14:00 [IST]
Other articles published on Nov 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+