Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నట్టూ.. నీ బౌలింగ్ ఆకట్టుకుందయ్యా: ఆసీస్ మాజీ పేసర్

Australia legend Glenn McGrath says T Natarajan Is The Find Of The Tour For India

సిడ్నీ: టీమిండియా యువ బౌలర్‌ టీ నటరాజన్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకు నటరాజన్‌ రూపంలో ఓ గొప్ప ఆటగాడు లభించాడని కొనియాడాడు. అతని సూపర్బ్ బౌలింగ్ తనను వీపరీతంగా ఆకట్టుకుందని, ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ ఇలాగే తన ఫామ్‌ను కొనసాగించాలని ఆకాంక్షించాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్‌.. అరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి 2-0తో సిరీస్‌ కోల్పోయిన జట్టుకు ఉపశమన విజయాన్నందించాడు.

మరో బుమ్రాలా..

మరో బుమ్రాలా..

ఈ సూపర్ ఫెర్ఫామెన్స్‌తో టీ20ల్లోకి కూడా అరంగేట్రం చేసి మరో బుమ్రాలా చెలరేగాడు. తొలి టీ20లో 4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసిన నట్టూ.. ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత బౌలర్లంతా విఫలమైన వేళ పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగానే ఆసీస్‌ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఈ క్రమంలో భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుని వన్డే సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మెక్‌గ్రాత్‌ నట్టూను కొనియాడాడు.

 భారత్‌కు దొరికిన ఆణిముత్యం..

భారత్‌కు దొరికిన ఆణిముత్యం..

కొన్నేళ్ల క్రితం ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ కార్యక్రమంలో భాగంగా నటరాజన్‌‌ను కలిసినట్లు మెక్‌గ్రాత్ గుర్తు చేసుకున్నాడు. ‘నట్టూ బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతం. ఆస్ట్రేలియా పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. ఇకపై తాను వికెట్లు తీసేందుకు కేవలం యార్కర్లపై మాత్రమే ఆధారపడే పరిస్థితి లేదు. నటరాజన్‌ ఆట నన్ను ఇంప్రెస్‌ చేసింది. ఈ పర్యటనలో భారత్‌కు లభించిన ఆణిముత్యం అతను. నట్టూ మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.'అని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు. 2015-16 ఆసీస్‌ టూర్‌లో బుమ్రా, 2018-19లో మయాంక్‌ అగర్వాల్‌ మెరుగైన ప్రదర్శనతో వెలుగులోకి రాగా.. ప్రస్తుతం నటరాజన్‌ సైతం ఆస్ట్రేలియా టూర్‌లోనే తనదైన ముద్ర వేయడం గమనార్హం.

నట్టూ ఆటకు మాజీలు ఫిదా..

నట్టూ ఆటకు మాజీలు ఫిదా..

ఇక అరంగేట్ర పర్యటనలోనే రాణిస్తున్న నటరాజన్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నటరాజన్‌ ఫామ్‌ చూస్తుంటే షమీ స్థానానికి ఎసరు వచ్చేలా ఉందని సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే విధంగా అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి టీమిండియాకు ఆడటం వెనుక ఉన్న అతడి కఠోర శ్రమ గురించి క్రికెట్‌ దిగ్గజాలు ఇయాన్‌ బిషప్‌, టామ్‌ మూడీ సైతం ప్రస్తావిస్తూ... తనది మనసును హత్తుకునే అద్భుతమైన కథ అంటూ ట్వీట్‌ చేశారు.

విరాట్ కోహ్లీ బిడ్డపై జడేజా అనుచిత వ్యాఖ్యలు.. తన్ని తరిమేయాలన్న ఫ్యాన్స్!

Story first published: Monday, December 7, 2020, 20:09 [IST]
Other articles published on Dec 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+