Asian Games 2026: భారత్‌కు మరో పతకం.. తృటిలో స్వర్ణం మిస్!
Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ సంచలనం ఈషా సింగ్ అద్భుత ప్రదర్శనతో మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అసాధారణ రీతిలో పుంజుకుని ఇండియాకు రజత పతకాన్ని అందించి ప్రశంసలు అందుకుంటోంది.
ఒంటరి పోరాటంతో పతకాల రేసులోకి..
క్వాలిఫైయిండ్ రౌండ్లో ప్రతిభావంతులైన షూటర్లు మను భాకర్, రాహి నిష్క్రమించడంతో భారత్ ఆశలన్నీ ఈషా సింగ్‌పైనే నిలిచాయి. మొత్తం 44 మంది షూటర్లు పాల్గొన్న ఈ క్వాలిఫైయింగ్ రౌండ్లో ఈషా సింగ్ తీవ్రమైన పోటీని ఎదుర్కొని ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్ తైపీకి చెందిన యెన్-చింగ్ చెంగ్‌తో స్కోరు సమమైనప్పటికీ.. 22 బుల్‌సైలను కొట్టడం ద్వారా ఈషా సింగ్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది.

నాలుగో స్థానం నుంచి పుంజుకుని థ్రిల్లింగ్ ఫైట్
ఫైనల్ రౌండ్లో ప్రారంభంలో కొద్దిగా ఫామ్ తప్పిన ఈషా సింగ్ నాలుగో స్థానానికి పడిపోయింది. అయితే ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన ఏకాగ్రతతో వరుస షాట్లలో రాణించింది. తొమ్మిది సిరీస్‌ల పూర్తయ్యేసరికి కొరియన్ షూటర్‌తో కలిసి 34 పాయింట్లతో సమంగా నిలిచింది. దీంతో జరిగి కాంస్య పతక షూట్-అప్‌లో విజయం సాధించి స్వర్ణం/రజతం రేసులోకి దూసుకెళ్లింది.
స్వర్ణ పతకం కోసం హోరాహోరీ షూట్-అప్
పైనల్ సిరీస్‌లో ఈషా సింగ్ ఐదు లక్ష్యాలలో నాలుగుంటిని ఛేదించగా.. చైనా షూటర్ మూడు మాత్రమే కొట్టింది. దీంతో ఇద్దరి స్కోర్లు 38-38తో సమమయ్యాయి. అనంతరం విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన చివరి షూట్-అప్ లో చైనా క్రీడాకారిణి స్వల్ప తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా.. ఈషా సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చివరివరకూ చూపిన అసమాన పోరాట పటిమతో ఈ రజతం కూడా స్వర్ణానికి ఏ మాత్రం తీసిపోని విధంగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


