మాజీ కెప్టెన్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న క్రికెట్ దిగ్గజం! (వీడియో)
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, 1992 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడైన జావేద్ మియాందాద్ తన మాజీ కెప్టెన్, ఆత్మీయ మిత్రుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితిని తలచుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం జైలులో ఖైదీగా ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అందుతున్న చికిత్స, ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న తీరుపై మియాందాద్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రస్తావనకు రాగానే మియాందాద్ ప్రత్యక్షంగా కన్నీళ్లు పెట్టుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని కదిలించింది.
ఇమ్రాన్ ఖాన్ ను అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తిగా మియాందాద్ వర్ణించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిత్వం గురించి తనకు చాలా బాగా తెలుసని.. ఆయన ఎంతమాత్రం అవినీతికి పాల్పడే రకం కాదని ఆయన వెల్లడించారు. ఒకవేళ అవినీతి చేయాలనుకుంటే ఆయన ఇంకెంతో సాధించి ఉండేవాడన్నారు. అసలు ఆయనను జైలులోనే ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. బయటకు వదిలితే ఆయన ఎవరినైనా తినేస్తాడా.. ఆయన కూడా ఒకరి కొడుకే కదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అసలు జైలులో ఆయనతో ఏం చేయిస్తున్నారో తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. అలాగే తాము ఆడే రోజుల్లో కేవలం మైదానంలో ఆటపరమైన అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండేవని.. తమ ఇద్దరి మధ్య ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, కుమారులు సులేమాన్, ఖాసిం ఇటీవల లార్డ్స్ టెస్ట్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను రోజుకు 23 గంటలకు పైగా ఓ చిన్న చీకటి గదిలోనే ఒంటరిగా ఉంచుతున్నారని.. ఆయన గొంతును శాశ్వతంగా అణచివేసేందుకు జైలులోనే చంపేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఆయన కంటిచూపు కూడా దాదాపు 85 శాతం క్షీణించిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా లార్డ్స్ టెస్ట్ విరామ సమయంలో ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బ్రాడ్‌కాస్టర్‌కు ఫిర్యాదు చేసింది.
ఇమ్రాన్ ఖాన్ పట్ల జైలులో జరుగుతున్న వ్యవహారశైలిపై అంతర్జాతీయ క్రికెట్ సమాజం నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్, ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ వంటి ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్ కు తగిన అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించాలని, మాజీ ప్రధానిని గౌరవప్రదంగా చూడాలని డిమాండ్ చేశారు. 1992 ప్రపంచ కప్ ఫైనల్లో ఇమ్రాన్ ఖాన్(72), మియాందాద్(58) కలిసి నెలకొల్పిన 139 పరుగుల చారిత్రాత్మక భాగస్వామ్యమే పాకిస్తాన్ కు ఏకైక వన్డే ప్రపంచ కప్ ను అందించింది. అలాంటి ఐకానిక్ కెప్టెన్ నేడు జైలు పాలై దుర్భర స్థితిలో ఉండటాన్ని మియాందాద్ జీర్ణించుకోలేకపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

