Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా కల్లోలం.. ఆసియాకప్ ఆగమాగం!!

Asia Cup 2020s fate hangs in the balance as Asian Cricket Council meeting postponed due to coronavirus

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగటట్లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో దేశం మొత్తం లాక్‌డౌన్ అవ్వగా.. ప్రపంచవ్యాప్తంగా ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇప్పటికే వాయిదా పడగా.. ప్రస్తుతం మొత్తానికే రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

 పాక్‌లో జరగాల్సి ఉండగా..

పాక్‌లో జరగాల్సి ఉండగా..

ఇక ఒలింపిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై గందరగోళం నెలకొంది. తాజాగా ప్రతిష్టాత్మక ఆసియాక‌ప్‌ కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది ఆసియాక‌ప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా పాక్‌లో పర్యటించలేమ‌ని, భారత జట్టు తెలపడంతో టోర్నీని వేరే చోటుకు తరలించేందుకు దాయాది అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశమై టోర్నీకి సంబంధించిన వేదికను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశం నిరవధికంగా వాయిదా పడింది.

మీకు తెలుసా? వన్డే‌ల్లో రోహిత్ (264*) అత్యధిక స్కోర్ కాదంటా!!

ఆసియాకప్ డౌటే..

ఆసియాకప్ డౌటే..

ఇక వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు అన్నీ నిలిచిపోయాయి. ప్రపంచమే లాక్‌డౌన్ అయింది. క‌రోనా కల్లోలం సద్దుమణిగినా.. ఆయా క్రికెట్ దేశాలు తమ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు మొగ్గు చూపుతాయి. అంతేకానీ ఆసియాకప్ వంటి టోర్నీలు ఆడవు. దీంతో ఆసియాక‌ప్ ఈ ఏడాది జరగడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీ20 ఫార్మాట్‌లో..

టీ20 ఫార్మాట్‌లో..

ఇక ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉండడంతో ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ఆర్గ‌నైజ‌ర్లు ఆలోచిస్తున్నారు. 2016లోనూ మెగా టోర్నీని దృష్టిలో పెట్టుకుని, పొట్టి ఫార్మాట్లోనే ఆసియాకప్‌ను నిర్వహించారు. అనంతరం 2018 లో యధావిధిగా 50 ఓవ‌ర్ల‌ ఫార్మాట్‌లో ఆడించారు. ఈ రెండు సార్లు ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన‌ భారత జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. ఒకవేళ ఈ ఏడాది ఆసియాకప్ జరిగితే భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. కరోనా కల్లోలం ఆగితే కానీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Story first published: Thursday, March 26, 2020, 16:44 [IST]
Other articles published on Mar 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+