For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ మ్యాచ్‌లో సచిన్ చాలా లక్కీ.. పాక్ ఆటగాళ్ల తప్పిదాలతో ఏకంగా నాలుగు లైఫ్‌లు!

 Ashish Nehra Says Sachin Tendulkar was dropped four times during his 85-run knock in the World Cup 2011 semi-final

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన 2011 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ చాలా కలిసొచ్చిందని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపాడు. పాక్ ఆటగాళ్ల తప్పిదాలతో ఏకంగా అతనికి నాలుగు లైఫ్‌లు లభించాయని గుర్తు చేసుకున్నాడు. గ్రేటెస్ట్‌ రైవల్రీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ పాక్‌పై సచిన్‌ చెలరేగిన ఆ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. అతడి అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో అదీ ఒకటని కొనియాడాడు.

అవసరం లేకున్నా..

అవసరం లేకున్నా..

‘ఇప్పుడు ఓ విషయం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. చెబుతున్నా. ఆ మ్యాచ్‌లో పలుమార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి సచిన్ తప్పించుకున్నాడు. ఆ రోజు సచిన్‌ ఎంత అదృష్టవంతుడో అతనికి కూడా తెలుసు. ఆ మ్యాచ్ మీరు చూస్తే 40 పరుగుల వద్ద సచిన్ క్యాచ్ డ్రాప్ చేశారు. అనేక తప్పిదాలు చేశారు. అదృష్టం కలిసొస్తే అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. సాధారణంగా ప్రపంచకప్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. అలాంటి భారత్-పాక్, భారత్- ఇంగ్లండ్ మ్యాచ్ అంటే మరింత ఒత్తిడి నెలకొంటుంది. ఏ జట్టు సెమీస్‌కు చేరినా అది గొప్ప జట్టే. కానీ చివరకు ఒత్తిడిని ఎవరు అధిగమిస్తారో వారే విజయాన్నందుకుంటారు.

సెహ్వాగ్ ఆరంభం చూసి..

సెహ్వాగ్ ఆరంభం చూసి..

ఇక నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మేం.. సెహ్వాగ్ ఆరంభాన్ని చూసి ఓ దశలో 340-350 పరుగులు చేస్తామనుకున్నాం. ఉమర్ గుల్ బౌలింగ్‌లో వీరు.. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు బాదాడు. కానీ మేం 257-258 రన్స్‌కే పరిమితమయ్యాం. మేం బౌలింగ్ చేసేటప్పుడు పాక్ కూడా అద్భుతంగా మొదలు పెట్టింది. కానీ 257 రన్స్ స్వల్ప స్కోర్‌ను కాపాడుకొని విజయాన్నందుకున్నాం. భారత జట్టు అద్భుతంగా పోరాడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

నాలుగు లైఫ్స్..

నాలుగు లైఫ్స్..

ఇక ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ (115బంతుల్లో 11ఫోర్లతో 85) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. లేకుంటే భారత్ పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే పాక్ ఆటగాళ్లు మిస్బా ఉల్ హక్, కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్, యూనిస్ ఖాన్‌ల తప్పిదాలతో సచిన్ నాలుగు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 27, 45, 70, 81 పరుగుల వద్ద సచిన్‌ను ఔట్ చేసే అవకాశాలను చేజార్చుకున్నారు. అయినా చివరికి కెరీర్‌లో 100వ శతకానికి చేరవైన సమయంలో అజ్మల్‌ బౌలింగ్‌లో షాహిద్‌ అఫ్రిది క్యాచ్‌ అందుకోవడంతో వెనుదిరిగాడు. తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఆఖరికి జట్టు స్కోర్‌ 260/9తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తలో రెండు వికెట్లు..

తలో రెండు వికెట్లు..

అనంతరం ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టుకు మంచి ఆరంభమే లభించినా తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించలేకపోయారు. మధ్యలో మిస్బాఉల్‌ హక్‌(56) ఒంటరి పోరాటం చేసిన అతడికి సహకరించే బ్యాట్స్‌మెన్‌ లేక ఆ జట్టు ఓటమిపాలైంది. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా,జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తలో రెండు వికెట్లు తీయడంతో భారత్ 29 రన్స్‌తో గెలిచి సగర్వంగా ఫైనల్ చేరింది.

లేజీ గర్ల్స్‌నే డబ్బు ఆకట్టుకుంటుంది.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై మనోజ్ తివారీ ట్వీట్

Story first published: Tuesday, August 11, 2020, 15:11 [IST]
Other articles published on Aug 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+