Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే ధోనీని తిట్టాల్సి వచ్చింది: నెహ్రా

Ashish Nehra on hurling abuses at MS Dhoni in 2005 for dropping a catch against Pakistan

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అయితే నెహ్రా ఓ విషయంలో ఇప్పటికీ విమర్శలను ఎదుర్కొంటాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఆ వీడియో ఏంటంటే..?

2005లో పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించింది. ఈ టూర్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఆరు వ‌న్డేల‌ సిరీస్‌ను 4-2తో గెలుపొందింది. అయితే ఈ సిరీస్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో నాటి వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది నెహ్రా కెరీర్‌లో మాయని మచ్చగా మిగలడంతో ఆ వ్యవహారంపై తాజాగా అతను స్పందించాడు.

అందుకే సహనం కోల్పోయా..

అందుకే సహనం కోల్పోయా..

టైమ్స్ నౌ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాటి మ్యాచ్‌తో తాను సహనం కోల్పోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

‘ధోనీపై నేను అసహనం వ్యక్తం చేసిన ఓ వీడియో చాలా వైరల్ అయింది. అందరూ ఆ వీడియో విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్ కు సంబంధించింది అనుకుంటారు. కానీ అది అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో వన్డేలో చోటు చేసుకుంది. ఆ మ్యాచ్‌లో నేను వేసిన బంతి షాహిద్ అఫ్రిదీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న ద్రవిడ్.. కీపర్ ధోనీ మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో అసహానానికి గురైన నేను ధోనీ, ద్రవిడ్‌పై అరిచాను. ఆ రోజు అలా ప్రవర్తించడంపై ఎన్నోసార్లు చింతించాను. ఇప్పటికీ ఆ ఘటనపై సంతృప్తిగా లేను.

కానీ ఆ బంతికి ముందే షాహిద్ అఫ్రిదీ నా బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే మాములుగానే ఒత్తిడి ఉంటుంది. అలాంటిది దొరికిన మంచి అవకాశం చేజారడంతో సహనం కోల్పోయా. ఇలాంటి సమయంలో ఏ క్రికెటర్ అయినా కూడా అలానే ప్రవర్తిస్తాడు. ఈ ఘ‌ట‌న తర్వాత ధోనీ, ద్రవిడ్ నాతో మామూలుగానే ఉన్నారు. కానీ నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు.' అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

విశాఖ తీరానా ధోనీ సృష్టించిన ఆ విధ్వంసం గుర్తుందా?

అందుకే ఆ వీడియో పాపులర్..

అందుకే ఆ వీడియో పాపులర్..

ఈ ఘటన జరిగి 15 ఏళ్లు అయినా ఆ వీడియో పాపులర్ అవ్వడానికి ధోనీనే కారణమని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ధోనీ ఎదిగిన తీరు.. సాధించిన విజయాలు.. అతనికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్‌తోనే ఈ వీడియో ఇంకా వైరల్ అవుతుందని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు.

‘ధోనీ వల్లే ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుంది. ఇది కూడా చిన్నప్పటి కోహ్లీకి నేను అవార్డు అందజేసిన ఫోటోలాంటిదే. ఈ ఫొటో కూడా చాలా పాపులర్ అయింది. దీనికి కోహ్లీనే కారణం. ఏదో ఒకరోజు నా పిల్లలు కూడా ఆ వీడియో చూసి అలా ఎందుకు ప్రవర్తించావని అడగవచ్చు. నేను వివరణ ఇచ్చుకునే పరిస్థితి రావచ్చు. 'అని నెహ్రా తెలిపాడు.

ధోనీ సారథ్యంలోనూ...

ధోనీ సారథ్యంలోనూ...

ధోనీ భారత కెప్టెన్‌ అయ్యాక కూడా నెహ్రా అత‌ని కెప్టెన్సీలో ఆడాడు. 2011 వన్డే ప్రపంచక‌ప్‌ గెలుపొందిన భారత జట్టులో త‌ను సభ్యుడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన తర్వాతే నెహ్రా జాతీయ‌జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం నిలకడగా రాణించి టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆడాడు. ఇక 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Sunday, April 5, 2020, 17:20 [IST]
Other articles published on Apr 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+