న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కెప్టెన్సీలోనే యూవీ అద్భుతంగా ఆడాడు: నెహ్రా

Ashish Nehra feels Yuvraj Singhs performance under MS Dhoni was impeccable
Yuvraj Singh Played His Best Under Dhoni's Captaincy

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికీ తన అత్యుత్తమ కెప్టెన్ సౌరవ్ గంగూలీనేనని తెలిపాడు. దాదా ఇచ్చిన సపోర్ట్.. ధోనీ, కోహ్లీ నాయకత్వాల్లో లభించలేదని పేర్కొన్నాడు. అయితే తాజాగా ఈ సిక్సర్ల సింగ్ సహచర ఆటగాడు, భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా మాత్రం ధోనీ కెప్టెన్సీలోనే యువరాజ్ ఓ వెలుగు వెలిగాడని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ హిందీ చానెల్ నిర్వహించిన క్రికెట్ కనెక్టెడ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఈ మాజీ పేసర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నా వరకు మాత్రం...

నా వరకు మాత్రం...

‘నేను చూసినంత వరకు ధోనీ సారథ్యంలోనే యువరాజ్ అద్భుతంగా ఆడాడు. 2007, 2008లో అతను విధ్వంకర బ్యాటింగ్‌తో చెలరేగడు. 2011 ప్రపంచకప్‌లో అనారోగ్యానికి గురైనా.. అతని అద్భుత పోరాటం మనందరికి తెలిసిందే. ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలోనే జరగాయి. ఇక ఫేవర్ కెప్టెన్ ఎవరనే విషయంలో ప్రతీ ప్లేయర్‌కు ఓ చాయిస్ ఉంటుందనేది నా ఫీలింగ్. కానీ నా వరకు మాత్రం యువరాజ్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ధోనీ కెప్టెన్సీలోనే బాగా ఆడాడు. 'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

అక్టోబర్‌లో ఐపీఎల్..

అక్టోబర్‌లో ఐపీఎల్..

ఇక ఐపీఎల్ 2020 సీజన్ అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ఈ స్టార్ పేసర్ జోస్యం చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆగష్టులో నిర్వహించడం కుదరదని, వర్ష ప్రభావంతో ఎక్కువ మ్యాచ్‌లు రద్దయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు. ‘ఆగస్టులో ఐపీఎల్ సీజన్ నిర్వహించం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ సమయంలో భారత్‌లో వర్షలు పడుతుంటాయి. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మ్యాచ్‌లు చాలా వరకూ రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. అక్టోబరు నాటికి పూర్తిగా తగ్గముఖం పడితే.. 100 శాతం ఐపీఎల్ 2020 సీజన్ జరుగుతుంది'అని నెహ్రా స్పష్టం చేశాడు.

కైఫ్ తనయుడా.. మావోడితో మ్యాచ్ ఆడు.. పేస్ అంటే ఎంటో చూపిస్తాడు: అక్తర్

క్యాకరోనా..

క్యాకరోనా..

కరోనా పుణ్యమా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదాపడిన విషయం తెలిసిందే. ఇక దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడంపైనా సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఆగస్టు-సెప్టెంబరులో ఈ మెగా టోర్నీ నిర్వహించే ఆలోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నట్లు తెలుస్తోంది.భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం మధ్యాహ్నానికి 5,360కి చేరుకోగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య ఇప్పుడు 1,433,012కి చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ప్రభావిత దేశాలన్నీ స్వీయ నిర్భందంలోకి వెళ్లాయి.

Story first published: Wednesday, April 8, 2020, 16:09 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X