For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PKL 2019: రైడ్‌కు వెళ్లాడంటే పాయింట్ తేవాల్సిందే!

PKL 2019: Pawan Kumar Sehrawat - Top raider of this season

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్ మరింత ఆసక్తికరంగా జరుగుతోంది. జూలై 20న ఆరంభమైన ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే టోర్నీలో 53 మ్యాచ్‌లు ముగిశాయి. ఏడు విజయాలతో జైపుర్ పింక్ ఫాంథర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

కబడ్డీ మ్యాచ్‌లో రైడర్ పాత్ర ఎంతో కీలకం. ఆఖరు నిమిషంలో రైడర్లు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేసిన సందర్భాలను ఈ సీజన్‌లో ఎన్నో చూశాం. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌కు చెందిన రైడర్ పవన్ కుమార్ షెరావత్ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఇప్పటివరకు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన పవన్ కుమార్ షెరావత్ మొత్తం 103 రైడ్ పాయింట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, పట్నా పైరెట్స్‌కు చెందిన స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ 77 రైడ్ పాయింట్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

PKL 2019: Pawan Kumar Sehrawat - Top raider of this season

దబాంగ్ ఢిల్లీకి చెందిన నవీన్ కుమార్(75 పాయింట్లు), బెంగాల్ వారియర్స్‌కు చెందిన మణిందర్ సింగ్(68) పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. లీగ్‌లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్‌ల్లో గుజరాత్-పట్నా, తమిళనాడు-ముంబై జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

చెన్నై అంచెలో ఇదే చివరి లీగ్ మ్యాచ్‌లు కావడం విశేషం. రాత్రి 7.30 గంటలకు గుజరాత్ ఫార్చున్ జైయింట్స్ vs పట్నా పైరెట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా... రాత్రి 8.30 గంటలకు తమిళ తలైవాస్-యు ముంబా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై చెన్నై తలపడనున్న ఆఖరి మ్యాచ్ ఇదే.

Story first published: Friday, August 23, 2019, 17:43 [IST]
Other articles published on Aug 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+