Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రక్షాళన: ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా హెసన్, హెడ్‌కోచ్‌గా కటిచ్

RCB appoints Mike Hesson as Director of Cricket Operations, Simon Katich as head coach

హైదరాబాద్: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ ఆపరేషన్స్‌కు డైరెక్టర్‌గా నియమించింది. ఇక, సైమన్ కటిచ్‌ను హడ్ కోచ్‌గా నియమిస్తూ ఆ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా

ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా

ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా మైక్ హెస్సన్ విధానం, వ్యూహం, కార్యక్రమాలు, స్కౌటింగ్, పనితీరు నిర్వహణతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని అన్ని అంశాల్లో ఉత్తమ పద్ధతులను తీసుకురావడంతో పాటు క్రికెట్ కార్యకలాపాలకు బాధ్యత వహించనున్నాడు.

ఆటగాళ్లతో కలిసి

ఆటగాళ్లతో కలిసి

కోచింగ్ టీమ్, ఆర్సీబీ మేనేజింగ్ టీమ్‌లతో పాటు ఆటగాళ్లతో కలిసి పని చేయనున్నాడు. ఆర్సీబీ యాజమాన్యం ప్రత్యేకంగా సృష్టించిన పోస్టు ఇది. మైక్ హెస్సన్ గతంలో న్యూజిలాండ్ హెడ్ కోచ్, మెంటార్‌గా పని చేసిన అనుభవాన్ని రాబోయే సీజన్‌లో ఆర్సీబీ ఉపయోగించుకోనుంది.

భారత పర్యటనలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా లాన్స్ క్లూసెనర్

ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవని ఆర్సీబీ

ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవని ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని కైవసం చేసుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ను ఆర్సీబీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటి నుంచే ట్రోఫీపై దృష్టి సారించింది. న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్‌గా సేవలందించిన మైక్ హెస్సన్ ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ రేసులో సైతం పోటీ పడ్డాడు.

టీమిండియా హెడ్ కోచ్ రేసులో సైతం

టీమిండియా హెడ్ కోచ్ రేసులో సైతం

అయితే, కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ మరోసారి రవిశాస్త్రినే హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టుకు మైక్ హెస్సన్ ఆరేళ్లు కోచ్‌గా పనిచేశారు. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు కూడా సేవలందించారు. మైక్ హెస్సన్ కోచింగ్‌లోనే కివీస్‌ 2015 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది.

Story first published: Friday, August 23, 2019, 15:55 [IST]
Other articles published on Aug 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+