Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు: యాషెస్ మూడో టెస్టు హైలెట్స్

England vs Australia 3rd Test Day 4 Highlights, Ashes 2019: Centurion Ben Stokes Keeps England Alive In The Ashes

హైదరాబాద్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో మళ్లీ అద్భుతం చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో అసమాన పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించాడు.

219 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 135 నాటౌట్‌‌గా నిలిచి ఒంటి చేత్తో ఇంగ్లాండ్‌కు అపురూప విజయాన్ని అందించాడు. 359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ ఒకానొక దశలో చేసిన పరుగులు 286/9. ఇంగ్లాండ్ అభిమాని సైతం కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని, కానీ, బెన్ స్టోక్స్‌ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఆఖరి బ్యాట్స్‌మన్‌ లీచ్‌ను కాపాడుకుంటూ, కంగారూలకు షాకిచ్చాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. స్టోక్స్‌ రాణించడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌) పరుగుతో స్టోక్స్‌కు గొప్పగా సహకరించాడు. దీంతో ఆఖరి వికెట్‌కు స్టోక్స్‌ 76 పరుగులు జోడించాడు.

359 పరుగుల లక్ష్యఛేదనలో

359 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 156/3తో ఆదివారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఆట ప్రారంభంలోనే కీలకమైన కెప్టెన్‌ జో రూట్‌ (77) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత స్టోక్స్‌కు బెయిర్‌స్టో (36) అండగా నిలవడంతో ఓ దశలో 245/4తో మెరుగ్గానే కనిపించింది. అయితే, వరుసగా ఐదు వికెట్లు బెయిర్‌స్టో సహా బట్లర్‌ (1), వోక్స్‌ (1), ఆర్చర్‌ (15), బ్రాడ్‌ (0) కోల్పోయింది.

286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో

286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో

286 వద్ద 9వ వికెట్‌ పడిన దశలో మరో 73 పరుగులు చేయాల్సి ఉండటంతో ఆతిథ్య జట్టు కథ ముగిసినట్లే అనిపించింది. దీంతో ఆస్ట్రేలియా విజయం తథ్యమని అనుకున్నారంతా. ఇక్కడే అసలు కథ మొదలైంది. స్టోక్స్‌ పోరాడితే పోయేదేమీ లేదనుకుని రెచ్చిపోయాడు. 11వ నంబరు బ్యాట్స్‌మన్‌ జాక్‌ లీచ్‌ (17 బంతుల్లో 1 నాటౌట్‌)ను కాపాడుకుంటూ స్టోక్స్‌ చెలరేగాడు.

లయాన్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్‌ను లక్ష్యంగా చేసుకుని సిక్స్‌లు బాదాడు. మరోవైపు పేసర్లు ప్యాటిన్సన్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌లను కూడా స్టోక్స్‌ వదిలిపెట్టలేదు. హేజిల్‌వుడ్‌ ఓవర్లోనైతే వరుసగా 6, 6, 4 బాదాడు. టి20 తరహాలో స్కూప్‌ షాట్లు, రివర్స్‌ స్వీప్‌లు ఆడుతూ సెంచరీని అందుకున్నాడు. ఈ క్రమంలో బెన్ స్టోక్స్‌కు రెండు లైఫ్‌లు వచ్చాయి.

మాటలు చాలడం లేదు.. ఈ విజయం అమ్మకు అంకితం: సింధు

స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చిన హారిస్

స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చిన హారిస్

ఇంగ్లాండ్‌ స్కోరు 342 వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ను హారిస్‌ చేజార్చాడు. 357 వద్ద లీచ్‌ను అత్యంత తేలిగ్గా రనౌట్‌ చేసే అవకాశాన్ని లయాన్‌ వదిలేశాడు. అదే స్కోరు వద్ద బెన్ స్టోక్స్‌ ఎల్బీ కోసం లయాన్‌ చేసిన అప్పీల్‌ను అంపైర్‌ విల్సన్‌ తిరస్కరించాడు. అప్పటికీ ఆస్ట్రేలియా రివ్యూలు అయిపోవడంతో బెన్ స్టోక్స్‌ బ్రతికి పోయాడు.

లీచ్‌ సైతం బెన్ స్టోక్స్‌కు అనూహ్య మద్దతు

లీచ్‌ సైతం బెన్ స్టోక్స్‌కు అనూహ్య మద్దతు

మరోవైపు టెయిలెండర్ లీచ్‌ సైతం బెన్ స్టోక్స్‌కు ఇచ్చిన మద్దతు నిజంగా అద్భుతం. 357 వద్ద లీచ్‌ ఓవర్‌ మొదటి నుంచీ బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు మూడో బంతికి అతడు సింగిల్‌ తీయడంతో స్కోరు సమమైంది. చివరకు కమిన్స్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదడంతో చరిత్రాత్మక విజయం ఇంగ్లాండ్‌ సొంతమైంది.

పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు

లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించగా అందులో స్టోక్స్‌వే 74 పరుగులు ఉండటం విశేషం. టెస్టుల్లో చివరి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై కుశాల్‌ పెరీరా, విశ్వ ఫెర్నాండో జోడీ దక్షిణాఫ్రికాపై 78 పరుగులు చేసింది. యాషెస్‌ నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి జరుగుతుంది.

స్కోరు వివరాలు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 179

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 67

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 246

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: 362/9

Story first published: Monday, August 26, 2019, 11:33 [IST]
Other articles published on Aug 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+