నువ్వు నిజమైన చాంపియన్: డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌పై కోహ్లీ

హైదరాబాద్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‍కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ సోమవారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టెయిన్ రిటైర్మెంట్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "గేమ్‌లో నువ్వు నిజమైన చాంపియన్. నీ టెస్టు రిటైర్మెంట్ మరింత ఆనందమయం కావాలి పేస్ మెషీన్" అంటూ కోహ్లీ ట్విట్ చేశాడు.
ఆర్టికల్ 370 రద్దు: ఇప్పుడు MSD అంటే మహేంద్ర సింగ్ ధోని కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2008 నుంచి 2010 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున ఆడిన డేల్ స్టెయిన్.. 2019 సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే, గాయం కారణంగా ఆ తర్వాత టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆర్సీబీ తరుపున కోహ్లీతో కలిసి ఆడటంతో తన సహచర ఆటగాడికి కోహ్లీ అభినందులు తెలియజేశాడు.

మోడ్రన్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడు
మోడ్రన్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన 36ఏళ్ల డేల్ స్టెయిన్ టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సోమవారం ప్రకటించాడు. గత కొంత కాలంగా డేల్ స్టెయిన్‌ను తరచూ గాయాలు వేధిస్తున్నాయి. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన స్టెయిన్ దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఎనిమిదో స్థానంలో
ఇక, మొత్తంగా ఈ జాబితాలో ఎనిమిదో స్థానంతో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా తరుపున మొత్తం 93 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశారు. తన రిటైర్మెంట్ సందర్భంగా స్టెయిన్ "నాకు ఎంతో ఇష్టమైన ఒక క్రికెట్ ఫార్మాట్ నుంచి ఈ రోజు తప్పకుంటున్నాను. నా దృష్టిలో టెస్ట్ క్రికెటే అత్యుత్తమైంది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా అది మనల్ని పరీక్షిస్తుంది" అని అన్నాడు.

వన్డేలు, టీ-20లపై దృష్టిసారిస్తాను
"మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడను అనే ఆలోచన వస్తేనే నాకు చాలా బాధగా ఉంది. ఇక నా కెరీర్ ముగిసేవరకూ వన్డేలు, టీ-20లపై దృష్టిసారిస్తాను. ఆట కోసం నా సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రితా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను" అని స్టెయిన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications