Ashes 2019: స్టోక్స్ సెంచరీతో యోషెస్ మూడో టెస్టులో బద్దలైన రికార్డులివే!

హైదరాబాద్: వన్డే వరల్డ్‌కప్‌లో తన జట్టుకు ఒంటి చేత్తో విజయాన్నందించిన బెన్ స్టోక్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో మళ్లీ అద్భుతం చేశాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో దాదాపు అసాధ్యమైన 359 పరుగుల లక్ష్య ఛేదనలో, అది కూడా 9 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమైన స్థితిలో అసమాన పోరాటంతో జట్టుకు విజయాన్ని అందించాడు.
359 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఒకానొక దశలో చేసిన పరుగులు 286/9. ఇంగ్లాండ్ అభిమాని సైతం కలలోనైనా ఊహించి ఉండడు తమ జట్టు గెలుస్తుందని, కానీ, బెన్ స్టోక్స్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి బ్యాట్స్‌మన్ లీచ్‌ను కాపాడుకుంటూ, కంగారూలకు షాకిచ్చాడు. స్టోక్స్ సెంచరీతో ఇంగ్లాండ్ వికెట్ తేడాతో విజయం సాధించింది.
1-1తో సిరిస్ సమం
దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇదిలా ఉంటే, టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ ఇలా వికెట్ తేడాతో విజయం సాధించడం నాలుగోసారి. 1902లో ఆస్ట్రేలియాతో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వికెట్ తేడాతో గెలిచింది. ఆ తర్వాత 1907-08 సీజన్‌లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి వికెట్ తేడాతో విజయం సాధించింది.
1922-23లో కేప్‌టౌన్ వేదికగా
అనంతరం 1922-23లో కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వికెట్ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు టెస్టుల్లో వికెట్ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో ఇది అత్యధిక ఛేజింగ్ రికార్డు.
స్టోక్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు: యాషెస్ మూడో టెస్టు హైలెట్స్
లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు
1928-29లో ఆస్ట్రేలియాతో 332 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించిన అత్యధిక పరుగుల రికార్డుని తాజాగా బెన్ స్టోక్స్ తన సెంచరీతో బద్దలు కొట్టాడు. లీచ్‌తో కలిసి పదో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించగా అందులో స్టోక్స్‌వే 74 పరుగులు ఉండటం విశేషం. టెస్టుల్లో చివరి వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.
స్వర్ణ పతక విజేత పీవీ సింధుకు బాయ్ నజరానా
పెరీరా-విశ్వ ఫెర్నాండో రికార్డుకి చేరువగా
ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై కుశాల్ పెరీరా, విశ్వ ఫెర్నాండో జోడీ దక్షిణాఫ్రికాపై 78 పరుగులు చేసింది. అది ఇప్పటికీ తొలి స్థానంలో ఉండగా, స్టోక్స్-లీచ్‌ల రికార్డు రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉంటే ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో నాలుగో టెస్టు సెప్టెంబర్ 4 నుంచి జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications