అశ్విన్‌కు క్షమాపణలు చెప్పిన అర్ష్‌దీప్ సింగ్.. ఎందుకంటే?
టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భారత టీ20 లీడ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్ష్‌దీప్ సింగ్ టీ20ల్లో తన టాప్-5 భారత బౌలర్ల పేర్లను ప్రకటించాడు. ఇందులో అశ్విన్‌కు ఆఖరి స్థానం ఇచ్చాడు. దాంతోనే అదే ఇంటర్వ్యూలో అశ్విన్‌కు క్షమాపణలు తెలియజేశాడు.
ఇక అర్ష్‌దీప్ సింగ్.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ,కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లను తన టాప్-5 ఇండియన్ టీ20 బౌలర్స్‌గా పేర్కొన్నాడు. ఈ ఐదుగురితో కలిసి ఆడిన అర్ష్‌దీప్ సింగ్.. ఈ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాకు చోటివ్వకపోవడం గమనార్హం.
భువీదే టాప్ ర్యాంక్..
'భువనేశ్వర్ కుమార్ టాప్‌లో ఉంటాడు. ఎందుకంటే అతను నా ఫేవరేట్. అతనంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను కాస్త పక్షపాతంతోనే అతన్ని టాప్ టీ20 బౌలర్‌గా ఎంపిక చేశాను. అంతేకాకుండా ఓ ఫాస్ట్ బౌలర్‌గా నేను పేసర్‌కే టాప్ ర్యాంక్ ఇస్తాను. రెండో స్థానం షమీ భాయ్‌ది. ఎందుకంటే అతను ఎలాంటి వికెట్‌లోనైనా బంతిని సీమ్ చేయగలడు. అతని బౌలింగ్ అద్భుతం. పర్‌ఫెక్ట్‌గా సీమ్ చేయగలడు.

మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే అతను అత్యంత అరుదైన నైపుణ్యం కలిగిన లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్. ఆ తర్వాత యుజీ(యుజ్వేంద్ర చాహల్) భాయ్. పంజాబ్ టీమ్‌లో మేమిద్దరం టీమ్‌మెట్స్. అతని రికార్డ్ కూడా అద్భుతం.
అతను ఇప్పటికే ఎన్నో వికెట్లు తీసాడు.
సారీ అశ్విన్ భాయ్..
అశ్విన్ భాయ్‌కి ఆఖరి ప్లేస్ ఇవ్వాలనుకోను. కానీ మరో ఆప్షన్ లేక ఆయన ఐదో స్థానంలోకి వచ్చారు. అశ్విన్ భాయ్ గొప్ప బౌరల్. ఐపీఎల్‌లో పంజాబ్‌కు నా తొలి కెప్టెన్ కూడా. యష్ భాయ్ క్షమించండి.నేను వ్యక్తిగతంగా మీకు మెసేజ్ చేస్తాను.'అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
అశ్విన్ సారథ్యంలోని అర్ష్‌దీప్ సింగ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2019లో రూ.20 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ జట్టులోకి చేరిన అర్ష్‌దీప్ సింగ్.. అదే సీజన్‌లో అశ్విన్ సారథ్యంలో తొలి మ్యాచ్ ఆడాడు.
96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు..
ఐపీఎల్ 2020 సీజన్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు అర్ష్‌దీప్ సింగ్ కీలక పేసర్‌గా మారాడు. ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఆ జట్టుకే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతన్ని వదిలేసినా.. రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద రూ.18 కోట్లతో తిరిగి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 96 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్ సింగ్ 111 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

