Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. రేసులో ముగ్గురు పేసర్స్!

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్, మ్యాచ్ విన్నర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో రెండో వన్డేలో బుమ్రా ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. దాంతో ఆఖరి వన్డేకు దూరంగా ఉన్న బుమ్రా.. అనంతరం బీసీసీఐలోని సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.

శ్రీలంక టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించినప్పుడు జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. కొన్ని రోజుల క్రితం జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ అతను ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది.

Who Can Replace Jasprit Bumrah Top 3 Picks for India s Test Squad for Sri Lanka Series

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాథమిక పరీక్షల అనంతరం జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. దాంతో అతను శ్రీలకంతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఈ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లేందుకు భారత జట్టు సిద్దమవుతోంది. దాంతో బుమ్రా స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై పడింది. అయితే బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముగ్గురు పేసర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

IND vs SL: ఇక గెలిచినట్టే.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!

IND vs SL: ఇక గెలిచినట్టే.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!

1. అకిబ్ నబీ

దేశవాళీ స్టార్, రంజీ కింగ్ అకిబ్ నబీ రేసులో ముందున్నాడు. ఈ జమ్మూ కశ్మీర్ పేసర్ భారత్-ఏ తరఫున ఇప్పటికే శ్రీలంకలో పర్యటించి రెండు అనధికారిక టెస్ట్‌ల్లో 6 వికెట్లు తీసాడు. కాబట్టి ఈ జమ్మూ కశ్మీర్ రైట్ ఆర్మ్ పేసర్‌కే చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే జమ్మూ కశ్మీర్ తరఫున టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపును అందుకున్న తొలి ఆటగాడిగా అకిబ్ నబీ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ నుంచి టెస్ట్‌ల్లో భారత జట్టుకు ఎవరూ ప్రాతినిథ్యం వహించలేదు.

2. యశ్ ఠాకూర్.

జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబర్చిన యశ్ ఠాకూర్‌ కూడా రేసులో ఉన్నాడు. జింబాబ్వేతో రెండు టీ20ల్లో యశ్ ఠాకూర్ 4 వికెట్లు తీసాడు. రైట్ ఆర్మ్ పేసర్ అయిన యశ్ ఠాకూర్ కూడా భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఐదు లిస్ట్-ఏ గేమ్స్‌లో ఐదు వికెట్లు తీసిన యశ్ ఠాకూర్.. అనధికారిక టెస్ట్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెలెక్టర్లు యువ పేసర్‌కు ప్రాధాన్యత ఇస్తే.. నబీకి బదులు యశ్ ఠాకూర్‌కు అవకాశం దక్కుతుంది.

Auqib Nabi: రంజీ కింగ్‌కు ఘోర అవమానం.. 60 వికెట్లు తీసినా..!

Auqib Nabi: రంజీ కింగ్‌కు ఘోర అవమానం.. 60 వికెట్లు తీసినా..!

3.అన్షుల్ కాంబోజ్

అన్షుల్ కాంబోజ్ పేరు కూడా సెలెక్టర్ల పరిశీలనలో ఉంది. 2025లో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ సందర్భంగా తొలిసారి అన్షుల్ టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఓ మ్యాచ్ కూడా ఆడాడు. ఆ తర్వాత టెస్ట్ టీమ్‌కు దూరమయ్యాడు. భారత్- ఏ తరఫున అన్షుల్ కాంబోజ్ కూడా శ్రీలంకలో పర్యటించాడు. మూడు లిస్ట్-ఏ గేమ్స్‌, ఒక ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడాడు. అనధికారిక టెస్ట్‌లో ఒక వికెట్ తీసాడు. అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే అన్షుల్ కాంబోజ్‌కు చోటు దక్కవచ్చు. ఏది ఏమైనా అకీబ్ నబీకే చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ గంభీర్‌ ఎవర్ని ఎంచుకుంటాడో చూడాలి.

Story first published: Monday, August 3, 2026, 8:23 [IST]
Other articles published on Aug 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+