న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరుష్క పెద్ద మనసు.. వరద బాధితులకు సాయం!

Anushka Sharma, Virat Kohli announce donation to Assam, Bihar flood relief measures

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఓవైపు దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా.. మరోవైపు అసోం, బిహార్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఈ విపత్కర కాలంలో బాధితులకు విరుష్క జోడీ అండగా నిలిచింది. వారిని ఆదుకుంటామని ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద సేవా సంస్థలు యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌, గూంజ్‌ ద్వారా తమవంతు చేయూతనివ్వనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లోని వారికి సాయం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

మేం అండగా ఉంటున్నాం..

మేం అండగా ఉంటున్నాం..

దీనికి సంబంధించి అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ మూడు స్వచ్చంధ సంస్థల లింక్‌లను కూడా షేర్‌ చేశారు. ‘కరోనాతో దేశం అల్లాడిపోతుంటే మరోవైపు బిహార్‌, అ‍స్సాం ప్రజలు వరదలలో చిక్కుకుకొని విలవిలలాడుతున్నారు. చాలా మంది ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. మూడు ఆర్గనైజేషన్‌లు వారికి సహాయచర్యలు అందిస్తున్నాయి. మేం వారికి అండగా ఉంటున్నాం. మీరు కూడా ఈ సంస్థల ద్వారా సాయాన్ని అందించండి.'అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

మేం సాయం చేశాం..

మేం సాయం చేశాం..

ఇక మరోనటి గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా వరద బాధితులకు తాను, తన భర్త నిక్‌జోనస్‌ విరాళాలు అందించినట్లు తెలిపింది. తాను పుట్టిన బిహార్‌తో పాటు, అస్సాం కూడా వరదల్లో చిక్కుకుందని చెప్పారు. ‘మేం సాయం చేశాం. ఇప్పుడు ఇక మీ వంతు' అంటూ ప్రియాంక ట్వీట్‌ చేశారు. మే 22 నుంచి అస్సాం, బిహార్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సాంలో 16.8 లక్షల మంది వరద బాధితులు ఉండగా, బిహార్‌లో 30 లక్షల మందికి పైగా ఈ వరదల వల్ల ప్రభావితం అయ్యారు.

కరోనా కట్టడికి రూ.3 కోట్ల విరాళం..

ఇక కరోనా కట్టడికి కూడా విరుష్క జోడీ విరాళం అందించింది. లాక్‌డౌన్ బాధితుల కష్టాలను చూస్తే గుండె తరుక్కుపోతుందని, తాము చేసే ఈ సాయం వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని విరుష్కజోడీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఏం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి సాయం చేస్తున్నట్లు సోమవారం ట్విటర్‌లో ప్రకటించింది. అయితే ఎంత సాయం చేస్తున్నామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఐపీఎల్ జరుగుతుంది సరే.. రూ.3 వేల కోట్లు వస్తాయా? ఆందోళనలో స్టార్ గ్రూప్!

Story first published: Friday, July 31, 2020, 10:35 [IST]
Other articles published on Jul 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X