Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఆటపై నోరు జారిన సునీల్ గవాస్కర్.. డబుల్ మీనింగ్ కామెంట్స్‌పై మండిపడ్డ అనుష్క శర్మ!

Anushka Sharma Gives Befitting Reply to Sunil Gavaskar Over Distasteful Remark

న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త ఆటలోకి తననేందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. తనపట్ల గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయని మండిపడింది. గురువారం కింగ్స్‌ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ నేతృత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఘోర ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన కోహ్లీ.. అటు ఫీల్డింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు.

ఈ క్రమంలో విరాట్‌ను విమర్శిస్తూ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశాడు. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ అనూష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడు అంటూ ఓ హాట్ కామెంట్ విసిరాడు. అది కాస్తా కోహ్లీ ఫ్యాన్స్‌నే కాదు.. ఇటు అనూష్మ అభిమానులను కూడా ఆగ్రహానికి గురి చేసింది. ఉదయం నుంచి లెంజడరీ క్రికెటర్‌ను అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనుష్కశర్మ కూడా ఇన్‌స్టా స్టోరీలో గవాస్కర్ తీరును తప్పుబట్టింది.

మిస్టర్ సునీల్ గవాస్కర్..

మిస్టర్ సునీల్ గవాస్కర్..

‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వస్తుంది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను మీరు గౌరవిస్తారనుకుంటున్నా. అప్పుడు నా పట్ల మీకు అలాంటి గౌరవం లేదా? గత రాత్రి నా భర్త ఆటతీరుపై వ్యాఖ్యానించడానికి మీ వద్ద చాలా పదాలు, కామెంట్స్ ఉండే ఉంటాయి. కానీ వాటికి నాపేరును ఉపయోగిస్తేనే మీ విమర్శలు పవర్ ఫుల్‌గా ఉంటాయనుకున్నారా?

నో ఛేంజ్

నో ఛేంజ్

2020 వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను క్రికెట్‌లోకి లాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఆగుతాయో? గౌరవనీయులైన గవాస్కర్.. ఈ జెంటిల్ మెన్ గేమ్‌లో మీరో దిగ్గజం. మీరు నా పట్ల చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత నాకు ఏం అనిపించిందో అది చెప్పాలనుకున్నా'అని అనుష్క ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. విరాట్ కోహ్లీ మాత్రం స్పందించలేదు.

కామెంటేటర్‌గా తొలగించాలి..

సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్స్‌పై అటు క్రికెట్, ఇటు సినిమా అభిమానులు మండిపడుతున్నారు. ఓ దిగ్గజ ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ గవాస్కర్ హుందాగా వ్యవహరించట్లేదని మండిపడుతున్నారు. ఆయనను కామెంటేటర్‌ హోదా నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారు. అలాంటి డబుల్ మీనింగ్ అర్థాలతో వ్యాఖ్యానాలు చేయడం.. పైగా ఓ పబ్లిక్ వేదిక మీద అలాంటి కామెంటరీ సరికాదంటూ హితవు పలుకుతున్నారు. ఆయన కామెంట్స్‌ను తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో క్రికెటర్లను విమర్శించిన సంజయ్ మంజ్రేకర్‌ను పక్కన పెట్టినప్పుడు గవాస్కర్‌పై కూడా వేటు వేయాలని విరుష్కా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అపార్ధం చేసుకున్నారు..

అపార్ధం చేసుకున్నారు..

ఇక గవాస్కర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో అతని అభిమానులు స్పందించారు. అతని వ్యాఖ్యలను పూర్తిగా అపార్ధం చేసుకున్నారని సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. లాక్‌డౌన్‌లో అనుష్కతో ప్రాక్టీస్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అనుష్క శర్మ వేసిన బంతులకు విరాట్ ప్రాక్టీస్ చేశాడు. అయితే ఈ బంతుల గురించే తాను మాట్లాడాడనని కానీ అందరూ గవాస్కర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అతని కామెంట్రీకి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. అనుష్క ఇటీవలే తల్లికావడంతో అందరూ గవాస్కర్ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారని, అతని ఉద్దేశం అది కాదని చెప్పుకొచ్చారు.

CSK vs DC ప్రివ్యూ: ధోనీ vs అయ్యర్.. గెలిచేది అనుభవమా.. యువతరమా?

Story first published: Friday, September 25, 2020, 15:59 [IST]
Other articles published on Sep 25, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+