Hardik Pandya: పవన్ కళ్యాణ్ హీరోయిన్‌తో హార్దిక్ పాండ్యా హంగామా!
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి అమీషా పటేల్ ముంబైలోని ఐకానిక్ 'తాజ్ మహల్ ప్యాలెస్' హోటల్‌లో కలిసి కనిపించారు. వీరిద్దరూ ఈ లగ్జరీ హోటల్లో సందడి చేస్తూ సరదాగా గడిపిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హార్దిక్ పాండ్యా భారత జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్నారు. టీమిండియా సాధించిన 2024, 2026 టీ20 ప్రపంచ కప్ విజయాల్లో బ్యాట్‌తోనూ, బంతితోనూ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. మరోవైపు అమీషా పటేల్ 'కహో నా ప్యార్ హై' , 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 'గదర్ 2' 'భూల్ భూలయా' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీషా పటేల్ తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి', మహేష్ బాబుతో 'నాని' వంటి చిత్రాల్లో నటించారు.

ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్, గాయాల సమస్యల కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో శిక్షణ పొందుతున్న సమయంలో కాలికి గాయం కావడంతో ఆయనను అఫ్గానిస్తాన్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2026 తర్వాత హార్దిక్ పాండ్యా ఏ రకమైన పోటీ క్రికెట్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ లోనూ 4 మ్యాచ్ లకు దూరమయ్యారు. ఆ సీజన్లో ఆడిన 10 మ్యాచ్‌లలో 138.25 స్ట్రైక్ రేట్ తో 206 పరుగులు చేసి బౌలింగ్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీశారు.
హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వన్డే మ్యాచ్‌లలో ఆయన పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేయగలరా లేదా అనే దానిపై జట్టు యాజమాన్యానికి అనుమానాలు ఉన్నాయి. రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో హార్దిక్ పాత్ర అత్యంత కీలకమైనప్పటికీ.. ఆయన ఫిట్‌నెస్ వైఫల్యాలు టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారాయి. వరుస గాయాల కారణంగానే హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్సీకి పరిశీలించలేదని సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


