For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిగ్గుపడటానికి నేను దొంగనా? మీడియాపై బంగ్లా క్రికెటర్ అసహనం

Am I a thief? Mashrafe Mortaza Fires On reporter asks if he was ashamed of his bowling

సిలేట్‌(ఢాకా): బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మష్రఫె మోర్తాజా మీడియాపై అసహనం వ్యక్తం చేశాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు దూరమైన ఈ బంగ్లాపేసర్ ఆదివారం నుంచి జింబాబ్వేతో తలపడే మూడు వన్డేల సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పూర్ ఫామ్‌తో సిగ్గు పడుతున్నారా?

పూర్ ఫామ్‌తో సిగ్గు పడుతున్నారా?

మోర్తాజా గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే వికెట్‌ తీశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు మీడియా ప్రతినిధి..'పూర్ ఫామ్ కారణంగా ఏమైనా సిగ్గుపడుతున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి చిర్రెత్తుకొచ్చిన బంగ్లా కెప్టెన్‌ 'నేనెందుకు సిగ్గుపడాలి? నేనేమైనా దొంగనా?' అని ఘాటుగా స్పందించాడు.

ఇలాంటివి పట్టించుకోను..

ఇలాంటివి పట్టించుకోను..

క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆత్మగౌరవం, సిగ్గుపడటం వంటి వాటిని తాను పెద్దగా అన్వయించుకోనన్నాడు. ‘నేను ఏమైన మైదానాన్ని దొంగిలించానా?, నేను దొంగనా? క్రికెట్‌లో ఆత్మగౌరవం, సిగ్గుపడటం లాంటి పదాలను పట్టించుకోను. కొందరు దొంగతనం, మోసం చేసినా సిగ్గుపడటం లేదు? వికెట్లు తీయనంత మాత్రానా నేను సిగ్గుపడాలా? నేను వికెట్లు తీయకపోతే మీలాంటి వారు, నా అభిమానులు విమర్శించొచ్చు. అంతేకాని, నేనెందుకు సిగ్గుపడాలి? బంగ్లాదేశ్‌ తరఫున ఆడట్లేదా? లేకపోతే వేరే దేశానికేమైనా ఆడుతున్నానా? ఒకవేళ నేను సరిగ్గా ఆడకపోతే జట్టు నుంచి బోర్డు నన్ను తప్పిస్తుంది. అంతేకానీ దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు' అని మోర్తాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మైదానంలో కోహ్లీ బూతుపురాణం.. ప్రేక్షకుల వైపు అసభ్య సైగలు!! (వీడియో)

ఇదే చివరి సిరీస్..

ఇదే చివరి సిరీస్..

ఇక జింబాబ్వే సిరీసే మోర్తాజాకు కెప్టెన్‌గా చివరిదని, ఆ తర్వాత కొత్త కెప్టెన్‌ను నియమిస్తామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ తెలిపాడు. అతడు కెప్టెన్‌గా బంగ్లా జట్టుకు ఎంతో చేసినా, ఇప్పుడు తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. మరోవైపు మోర్తాజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని గతంలో ప్రకటించినా, తన అభిప్రాయం మార్చుకున్నట్లు అర్థ మవుతోంది. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం ఆడతానని మోర్తజ తాజాగా వెల్లడించాడు.

Story first published: Sunday, March 1, 2020, 15:50 [IST]
Other articles published on Mar 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+