ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!

అహ్మదాబాద్: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలెక్స్ హార్ట్లీపై ఆ దేశ పురుష క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌తో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గురువారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిని తక్కువ చేస్తూ సెటైరిక్‌గా అలెక్స్ హార్ట్లీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ తమను అవమానించేలా ఉందని భావించిన ఆ దేశ పురుష క్రికెటర్లు రోరీ బర్న్స్, బెన్ డకెట్ ట్విటర్ వేదికగానే హార్ట్లీకి చివాట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

బాగుంది అబ్బాయిలు..
ఇంగ్లండ్ మహిళలు, న్యూజిలాండ్ మహిళల మధ్య జరిగిన సెకండ్ వన్డేను ఉద్దేశించి అలెక్స్ హార్ట్లీ చేసిన ట్వీట్ బెడిసి కొట్టింది. 'బాగుంది అబ్బాయిలు.. న్యూజిలాండ్ మహిళల మ్యాచ్ ప్రారంభానికి ముందే టెస్ట్ మ్యాచ్‌ను పూర్తి చేయడం బాగుంది'అని ట్వీట్ చేసింది. తమ మ్యాచ్‌ను హైలైట్ చేసే క్రమంలో హార్ట్లీ ఇంగ్లండ్ ఓటమిని తక్కువ చేసేలా ట్వీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదని అభిమానులు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు.
మంచి పద్దతి కాదు..
ఈ ట్వీట్‌పై రోరీ బర్న్స్ సైతం తీవ్ర అభంతరం వ్యక్తం చేశాడు. మహిళల క్రికెట్‌కు మద్దతు లభించేందుకు తాము ఓడిపోవాలనుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యమైనది కాదన్నాడు. 'అబ్బాయిలందరూ మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది నిరాశపరిచే వైఖరి'అంటూ హార్ట్లీ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ఇక రోరీ బర్న్స్ ట్వీట్‌ను బెన్ స్టోక్స్‌తో సహ జేమ్స్ అండర్సన్ లైక్ చేశారు. అయితే తర్వాత ఏం ఆలోచించాడో ఏమో కానీ రోరీ బర్న్స్ ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అయినా బర్న్స్ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

చెత్త ట్వీట్..
ఇక హార్ట్లీ ట్వీట్‌పై బెన్ డకెట్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరమ చెత్త ట్వీట్ అంటూ పేర్కొన్నాడు. 'యావరేజ్ ట్వీట్.. మహిళలు ఓడితే పురుషుల జట్టులోని ఆటగాళ్లు చప్పట్లు కొట్టే ఏమోజీలను షేర్ చేస్తారని అనుకోకండి'అంటూ హార్ట్‌లీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇక తన ట్వీట్‌పే రేగిన దుమారంపై హార్ట్లీ స్పందించింది. తన ఉద్దేశం అదికాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 'నేను చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవర్నీ తక్కువ చేస్తూ ట్వీట్ చేయలేదు. మేమంతా టెస్ట్ అభిమానులమే'అని స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఫైనల్ రేసు నుంచి ఇంగ్లండ్ ఔట్..
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా పరాజయంతో ఇంగ్లండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి నిష్క్రమించింది.ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా డ్రా చేసుకున్నా భారత్ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది.
India vs England: మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు.. విమర్శకులపై రోహిత్ శర్మ ఫైర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications