For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: మూడో టెస్ట్ ముందు రహానేను ఊరిస్తున్న రికార్డులు.. 42 ఏళ్ల ఆ నిరీక్షణకు తెరపడెనా?

Ajinkya Rahane eyes entry into elite list as India captain gears up for Sydney Test

సిడ్నీ: మెల్‌బోర్న్‌ విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టు ఆస్ట్రేలియాతో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతోంది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరొకటి గెలిచి సమంగా నిలవడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ టెస్ట్ ముందుకు ఆటేతర విషయాలతో రేగిన వివాదాలు నెమ్మదిగా సద్దుమనుగుతున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు సిడ్నీ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. గెలుపే లక్ష్యంగా సన్నదమవుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ అజింక్యా రహానేను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.

మూడో టెస్ట్ గెలిస్తే..

మూడో టెస్ట్ గెలిస్తే..

ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వరుసగా నాలుగు టెస్ట్‌లు గెలిచిన రెండో భారత కెప్టెన్‌గా అజింక్యా రహానే అరుదైన ఘనతను అందుకోనున్నాడు. ఇప్పటికే ఈ రికార్డును ధోనీ తన పేరిట లిఖించుకున్నాడు. 2008లో కుంబ్లే నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న మహీ వరుసగా నాలుగు టెస్ట్‌లు గెలిపించాడు. ఇక కోహ్లీ గైర్హాజరీ సారథ్య బాధ్యతలు అందుకున్న రహానే మెల్‌బోర్న్‌లో సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు స్వదేశంలోనూ రెండు టెస్ట్‌ల్లో జట్టును నడిపించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక మరో 203 రన్స్ చేస్తే..

ఇక మరో 203 రన్స్ చేస్తే..

మెల్‌బోర్న్ టెస్ట్‌లో బాధ్యతాయుతమైన సెంచరీతో ఆకట్టుకున్న రహానే.. సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్‌లో 203 పరుగులు చేస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుకెక్కనున్నాడు. ఇప్పటి వరకు కంగారుల గడ్డపై 10 మ్యాచ్‌లు ఆడిన రహానే.. 797 రన్స్ చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 20 మ్యాచ్‌ల్లో 1809 రన్స్‌తో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ 13 మ్యాచ్‌ల్లో 1352 రన్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత వీవీఎస్ లక్ష్మణ్(15 మ్యాచ్‌ల్లో 1236), రాహుల్ ద్రవిడ్(15 మ్యాచ్‌ల్లో 1143), వీరేంద్ర సెహ్వాగ్(10 మ్యాచ్‌ల్లో 948), సునీల్ గవాస్కర్( 11 మ్యాచ్‌ల్లో 920) రహానే కన్నా ముందున్నారు.

109 రన్స్ చేస్తే..

109 రన్స్ చేస్తే..

ఈ సిడ్నీ టెస్ట్‌లో రహానే 109 పరుగులు చేస్తే విదేశాల్లో కనీసం 3వేల టెస్ట్ పరుగులు చేసిన 10వ బ్యాట్స్‌మన్‌గా రహానే గుర్తింపు పొందనున్నాడు. ఇప్పటి వరకు విదేశీ గడ్డలపై 40 మ్యాచ్‌లు ఆడిన రహానే.. 2891 పరుగులతో ఉన్నాడు. ఈ జాబితాలో కూడా సచిన్ టెండూల్కర్(106 మ్యాచ్‌ల్లో 8705) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్(93 మ్యాచ్‌ల్లో 7667), సునీల్ గవాస్కర్ (60 మ్యాచ్‌ల్లో 5055), వీవీఎస్ లక్ష్మణ్(74 మ్యాచ్‌ల్లో 5014), సౌరవ్ గంగూలీ(63 మ్యాచ్‌ల్లో 4032), సెహ్వాగ్(51 మ్యాచ్‌ల్లో 3847), విరాట్ కోహ్లీ(48 మ్యాచ్‌ల్లో 3760), దిలీప్ వెంగ్‌సర్కార్ (62 మ్యాచ్‌‌ల్లో 3143), మోహిందర్ అమర్ నాథ్(37 మ్యాచ్‌ల్లో 3008) పరుగులతో ఉన్నారు.

42 ఏళ్ల నిరీక్షణ..

42 ఏళ్ల నిరీక్షణ..

గత 42 ఏళ్లుగా సిడ్నీ మైదానంలో భారత్‌కు విజయం దక్కలేదు. ఈ గ్రౌండ్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్కటంటే ఒక్కటే గెలిచి ఆరింటిలో ఓడింది. ఆ విజయం కూడా 1978లో బిషన్ బేడి సింగ్ సారథ్యంలోని భారత జట్టు ఇన్నింగ్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. 2019లో గెలుపు దిశగా దూసుకొచ్చిన భారత్.. వర్షం కారణంగా డ్రాతో సరిపెట్టుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన తొలుత 622 పరుగులు చేయగా.. ఆసీస్ 300 రన్స్‌కే చిత్తయింది. దాంతో భారత్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ఫాలోఆన్‌కు దిగిన ఆసీస్‌ను వర్షం గట్టెక్కించింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక్కటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లు ఇంగ్లండ్, పాకిస్థాన్, వెస్టిండీస్ మాత్రమే. ఆసియా నుంచి ఒక్క పాకిస్థానే సిడ్నీలో కనీసం రెండు మ్యాచ్‌లు గెలుపొందింది.

అదానీ గ్రూప్ వంట నూనెలకు గంగూలీ గుండె పోటు సెగ.. దెబ్బకు ప్రకటలన్నీ బంద్!

Story first published: Tuesday, January 5, 2021, 15:00 [IST]
Other articles published on Jan 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+