Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏబీ డివిలియర్స్ విధ్వంసకర శతకం.. 11 సిక్సర్లతో వీర విహారం!

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 42 ఏళ్ల వయసులోనూ తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని నిరూపించాడు. ఏకంగా 11 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌కు సారథ్యం వహిస్తున్న ఏబీ డివిలియర్స్.. 40 బంతుల్లో 6 ఫోర్లు 11 సిక్సర్లతో 111 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. టీమిండియాదే బ్యాటింగ్!

IND vs WI: వైభవ్ సూర్యవంశీకి నిరాశే.. టీమిండియాదే బ్యాటింగ్!

సౌతాఫ్రికా ఛాంపియన్స్ సునాయస విజయం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. డీఆర్సీ షార్ట్(25 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. సౌతాఫ్రికా ఛాంపియన్స్ బౌలర్లలో హర్డస్ మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, మర్చంట్ డీ లాంగే తలో వికెట్ తీసారు.

AB de Villiers Smashes 37-Ball Century With 11 Sixes in World Championship of Legends 2026

అనంతరం 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఏబీ డివిలియర్స్ విధ్వంసకర శతకంతో సునాయస విజయాన్నందుకుంది. 15.4 ఓవర్లలో 2 వికెట్లు 210 పరుగులు చేసి గెలుపొందింది. డివిలియర్స్‌కు తోడుగా రిచర్డ్ లెవి(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీసాడు.

IND vs AFG: బ్యాటింగ్ కాంబినేషన్ తలనొప్పే.. తిలక్ వర్మ‌ను ఏ స్థానంలో ఆడిస్తారు: ఏబీ డివిలియర్స్

Also Read

IND vs AFG: బ్యాటింగ్ కాంబినేషన్ తలనొప్పే.. తిలక్ వర్మ‌ను ఏ స్థానంలో ఆడిస్తారు: ఏబీ డివిలియర్స్

ఎగిరి గంతేసిన సతీమణి..

37 బంతుల్లోనే ఏబీ డివిలియర్స్ శతకం అందుకోగా.. గ్యాలరీలో ఉన్న అతని సతీమణి ఎగిరి గంతేసింది. అతని పిల్లలు కూడా ఈ సెంచరీనీ ఎంతో సెలెబ్రేట్ చేసుకున్నారు. స్టేడియం మొత్తం ఏబీ డివిలియర్స్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్ల అవుతున్నా.. 277.50 స్ట్రైక్‌రేట్‌తో ఏబీడీ బ్యాటింగ్ చేయడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ విజయంతో సౌతాఫ్రికా ఛాంపియన్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానం చేరింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, October 9, 2026, 20:33 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+