Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం వైభవ్.. గంభీర్ విధానం సరికాదు: ఏబీ డివిలియర్స్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న విధానాన్ని సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. వీలైనంత త్వరగా అతన్ని తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఐపీఎల్‌లో అతని విధ్వంసకర ఆటను చూశాక కూడా వేచి చూడటం ఎందుకని ప్రశ్నించాడు.

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ బిహార్ కుర్రాడు.. ఐర్లాండ్‌‌తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ సీనియర్ల కోసం వైభవ్ సూర్యవంశీని టీమిండియా మేనేజ్‌మెంట్ ఆడించడం లేదు.

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఆ విధానం సరికాదు..

15 ఏళ్ల వైభవ్ కోసం ప్రపంచకప్ గెలిపించిన ఆటగాళ్లను పక్కనపెట్టలేమని, అలా చేయడం కూడా సరికాదని, ఇతర ఆటగాళ్ల తరహాలోనే అరంగేట్ర ప్రక్రియను అనుసరించాలని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే అనడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ విభేదించాడు. వైభవ్ సూర్యవంశీకి అండగా నిలిచాడు.

AB de Villiers Questions India for Benching Vaibhav Sooryavanshi in Ireland and England Series

'వైభవ్ సూర్యవంశీని ఇంకెప్పుడు ఆడిస్తారు ఐర్లాండ్‌తో సిరీస్‌లోనే అతన్ని ఆడించాల్సింది. కానీ ఆడించకపోవడం అత్యంత దురదృష్టకరం. సూర్యవంశీ కూడా ఇతర ఆటగాళ్ల తరహాలోనే అరంగేట్ర ప్రక్రియను అనుసరించాల్సిందేననడం సరికాదు. ఐపీఎల్‌లో అతని విధ్వంసకర ఆటను చూశాక కూడా ఇంకా ఆగడం ఎందుకు? ఐర్లాండ్‌పై అతన్ని ఆడిస్తే బాగుండేది. కాస్త అనుభవం కూడా వచ్చేది.

భారత్‌ను ఓడించే దమ్ము మాకు లేదు: పాకిస్థాన్ హెడ్ కోచ్

భారత్‌ను ఓడించే దమ్ము మాకు లేదు: పాకిస్థాన్ హెడ్ కోచ్

అక్కడ దూకుడుగా ఆడలేరు..

వైభవ్ లేకుండా ఆడి ఆ సిరీస్‌ను భారత్ ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో తొలి టీ20 రదయ్యింది. ఇలాంటప్పుడే టీమిండియా బలంగా పుంజుకునేందుకు ప్రణాళికలు రచించాలి. ఇంగ్లండ్‌లో దూకుడుగా ఆడటం అంత ఈజీ కాదు. అక్కడ 220-250 పరుగులు చేయలేరు. ఆ పిచ్‌లపై 160 పరుగులు చేసినా సరిపోతుంది. అందుకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేయాలి. వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలి. భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.

Story first published: Friday, July 3, 2026, 13:13 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+