Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అతనికి లారా, సచిన్ లాగా ఎదిగే సత్తా ఉంది': మాజీ కెప్టెన్

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ బ్యారీ బ్రూక్ టాలెంట్ గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా వంటి గొప్ప క్రికెటర్ల సరసన చేరే సత్తా హ్యారీ బ్రూక్‌కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

IND vs SL: కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే భారత్ గెలిచేది: అశ్విన్

IND vs SL: కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉంటే భారత్ గెలిచేది: అశ్విన్

గతంలో బ్రూక్ మామయ్య తనను కలిసినప్పుడు కూడా బ్రూక్ లోని అసాధారణ ప్రతిభ గురించి నిజాయితీగా చెప్పానని బాయ్‌కాట్ వెల్లడించారు. హ్యారీ బ్రూక్ కు అద్భుతమైన టైమింగ్, షాట్ సెలెక్షన్, మంచి రీచ్ ఉన్నాయని.. అయితే తన ఆలోచనా విధానం వల్లే ప్రతిభను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని అన్నారు. బ్రాడ్‌మన్ తప్ప లారా, టెండూల్కర్ లాంటి దిగ్గజాల స్థాయికి చేరే సామర్థ్యం చాలా తక్కువ మందికే ఉంటుందని.. అందులో బ్రూక్ ఒకడని చెప్పారు.

Harry Brook Has Potential to Match Sachin Tendulkar and Brian Lara Says Geoffrey Boycott Details

టెస్ట్ క్రికెట్లో బ్రూక్ ఏకాగ్రతను, బ్యాటింగ్ శైలిని మెరుగుపరచడంలో సహాయం చేయడానికి తాను సిద్ధపడ్డానని బాయ్‌కాట్ పేర్కొన్నారు. బ్రూక్ మామయ్యకు తన ఫోన్ నంబర్ ఇచ్చి సంప్రదించమని చెప్పినప్పటికీ.. బ్రూక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. తానే స్వయంగా వెళ్లి మాట్లాడటం సరికాదని.. అతను అడిగితే సహాయం చేసేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

Also Read

IND vs SL: భారత్ X శ్రీలంక రెండో టెస్ట్ డ్రాకు 4 కారణాలు!

బ్రూక్ ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ.. ఏడాదికి పైగా ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేయలేదు. "అతను తన ప్రతిభను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. నేను ఇదివరకే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, నేను చాలా మంది ఆటగాళ్లను చూశాను. అతనికున్నంత ప్రతిభ ఉన్నవారిని చాలా కాలంగా చూడలేదు. అద్భుతమైన ప్రతిభ, టైమింగ్, షాట్ ప్లేయింగ్, అతను పొడవుగా ఉంటాడు, మంచి రీచ్ ఉంది, కానీ అతని ఆలోచనా విధానం నమ్మశక్యం కానిది," అని మాజీ క్రికెటర్ బాయ్‌కాట్ అన్నారు.

హెడింగ్లీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో బ్రూక్ 91 పరుగులు చేయగా.. లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 15 పరుగులు చేశాడు. "అతను ఇలాగే ఆడుతూ ఉంటే, అతనికి మంచి కెరీర్ ఉంటుంది, కానీ అతను మరింత మెరుగైన ఆలోచనతో ఆడితే, లారా, టెండూల్కర్ వంటి ఆటగాళ్ల సరసన నిలిచే సత్తా అతనికి ఉంది. నిజం చెప్పాలంటే, ఇది చాలా ప్రత్యేకమైన విషయం. అంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడం ఒక గొప్ప విషయం." అని బాయ్‌కాట్ స్పష్టం చేశారు.

Story first published: Sunday, August 30, 2026, 10:54 [IST]
Other articles published on Aug 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+