న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్ అతనికి కెప్టెన్సీ ఇస్తే మరో రోహిత్ శర్మ అవుతాడు: ఆకాశ్ చోప్రా

Aakash Chopra wants Kolkata Knight Riders to appoint Shubman Gill as captain for IPL 2021
Aakash Chopra Explains The Reason Behind Rashid Khan’s Success || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఉత్సాహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తదుపరి సీజన్ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఐపీఎల్ 2021ను ఏప్రిల్-మేలో నిర్వహిస్తామని ప్రకటించింది. పైగా వచ్చే సీజన్‌లో మరో కొత్త జట్టు రానుందనే సంకేతాలు కూడా ఇచ్చింది. దాంతో మెగా వేలం జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తదుపరి సీజన్‌ వేలంలో ఆయా జట్లు అనుసరించాల్సిన వ్యూహాలను తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తున్నాడు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కొన్ని సూచనలు చేశాడు.

శుభ్‌మన్‌‌ను కెప్టెన్ చేయాలి..

శుభ్‌మన్‌‌ను కెప్టెన్ చేయాలి..

తదుపరి సీజన్‌‌లో శుభ్‌మన్ గిల్‌కు కేకేఆర్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మరో రోహిత్ శర్మలా విజయాలందిస్తాడని తెలిపాడు. అలాగే మెగా వేలం జరిగితే కోల్‌కతా చాలా మంది క్రికెటర్లను రిటైన్ చేసుకోలేదని, వేలానికి ముందే ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్‌లను రిలీజ్ చేయాలని.. జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని సూచించాడు. శుభ్‌మన్ గిల్, ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తిలను మాత్రమే ఆ జట్టు రిటైన్ చేసుకోవాలన్నాడు.

అయ్యార్‌లానే..

అయ్యార్‌లానే..

ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేసినట్లుగానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ భవిష్యత్తు కోసం శుభ్‌మన్ గిల్‌‌ను కెప్టెన్‌గా తీర్చిదిద్దుకోవాలని ఆకాశ్ చోప్రా చెప్పాడు. ఈ అవకాశం మళ్లీరాదని, మరో జట్టు అతన్ని తీసుకుంటే.. కష్టం అవుతుందని తెలిపాడు. ముంబైకి రోహిత్ విజయాలను అందిస్తున్నట్లుగానే.. గిల్ సైతం కోల్‌కతాను విజయాల బాట పట్టిస్తాడని చోప్రా జోస్యం చెప్పాడు.

మోర్గాన్‌ను రిటైన్ చేయాలి..

మోర్గాన్‌ను రిటైన్ చేయాలి..

కోల్‌‌కతా వరుణ్ చక్రవర్తిని అంటిపెట్టుకోవాలని.. ఒకవేళ రస్సెల్‌ను వదులుకోవాలని భావిస్తే.. తిరిగి కొనుగోలు చేయడానికి భారీ మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నాడు. కోల్‌కతా సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్‌ను రిలీజ్ చేయాలని.. ఇలా చేస్తే భారీ మొత్తంలో వారి దగ్గర డబ్బు ఉంటుందని చోప్రా తెలిపాడు.

ఇయాన్ మోర్గాన్‌ను కెప్టెన్ చేయడం గొప్ప ఆలోచన అనుకోవడం లేదన్న ఆకాశ్ చోప్రా.. వేలానికి ముందు అతణ్ని వదులుకొని.. కావాలనుకుంటే తిరిగి కొనుగోలు చేయాలని సూచించాడు.

సూర్యకుమార్ యాదవ్‌ను ఆసీస్ టూర్‌కు ఎందుకు ఎంపిక చేయలేదు: బ్రియాన్ లారా

Story first published: Monday, November 23, 2020, 17:31 [IST]
Other articles published on Nov 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X