న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunrisers Hyderabad గెలవాలంటే ఈ మార్పులు చేయాల్సిందే: ఆకాశ్ చోప్రా

Aakash Chopra suggests some changes Sunrisers Hyderabad can make to their playing XI vs RCB
IPL 2021 : SRH లో మార్పులు చేయాల్సిందే... Sandeep ప్లేస్‌లో Abhishek,నబీకి బదులు Mujeeb || Oneindia

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ను ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో పోరుకు సిద్దమైంది. లీగ్‌లో బోణీ కొట్టడమే లక్ష్యంగా చెపాక్ స్టేడియంలో మరికొద్దిగంట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలంటే తుది జట్టులో పలు మార్పులు చేయాల్సిందేనని భారత మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చెన్నై పిచ్‌పై బంతి టర్న్ అవ్వడం మొదలైందని, ఆరెంజ్ ఆర్మీ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.

 ముజీబ్‌ను తీసుకోవాలి..

ముజీబ్‌ను తీసుకోవాలి..

ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్‌లో అంతా రైట్ హ్యాండర్స్ ఉన్నారని, ఈ క్రమంలో హైదరాబాద్ ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్నాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓవర్‌సీస్ ప్లేయర్స్‌ కొటాలో మహ్మద్ నబీని కొనసాగించాలనుకుంటారు. కానీ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ గురించి కూడా హైదరాబాద్ టీమ్‌మేనేజ్‌మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉంది.

చెన్నై పిచ్‌పై బంతి టర్న్ అవ్వడం మొదలైంది. వారు నబీని తీసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రత్యర్థి జట్టులో దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్ మినహా అంతా రైట్ హ్యాండర్సే ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. ఈ క్రమంలో మిస్టరీ స్పిన్నర్లు కావాలనుకుంటే నబీకి బదులు ముజీబ్‌ను ఎలా తీసుకురావాలని కూడా టీమ్‌మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తూ ఉండొచ్చు.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్‌కు కరోనా!

అభిషేక్ శర్మకు కూడా..

అభిషేక్ శర్మకు కూడా..

ఇక హైదరాబాద్ ఫించ్ హిట్టర్ అయిన అబ్దుల్ సమద్‌‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. అలాగే నబీ ప్లేస్‌లో ముజీబ్‌ను తీసుకుంటే.. సందీప్ శర్మ స్థానంలో అభిషేక్ శర్మకు అవకాశం ఇవ్వాలన్నాడు. అప్పుడు లోయరార్డర్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉంటుందన్నాడు. 'అబ్దుల్ సమద్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపించాలి. ఇక అభిషేక్ శర్మకు కూడా అవకాశం ఇవ్వాలి. జట్టు సమతూకంగా ఉండాలంటే ఈ యువ ఆల్‌రౌండర్‌ను ఆడించాలి.

నబీ స్థానంలో ముజీబ్‌ను తీసుకుంటే.. సందీప్ ప్లేస్‌లో అభిషేక్ శర్మకు చాన్స్ ఇవ్వాలి. అప్పుడు బ్యాటింగ్‌లో డెప్త్ ఉంటుంది. అలాగే కొన్ని బౌలింగ్ ఆప్షన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సమద్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం'అని చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.

ప్లే ఆఫ్స్ చేరే జట్టు ఫస్ట్ టీమ్..

ప్లే ఆఫ్స్ చేరే జట్టు ఫస్ట్ టీమ్..

ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈ సీజన్‌లో ఫస్ట్ ప్లే ఆఫ్ చేరే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాదేనని చోప్రా జోస్యం చెప్పాడు. అంతేకాకుండా ఫైవ్ టైమ్ చాంపియన్, పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఓడించే సత్తా కూడా హైదరాబాద్‌కే ఉందన్నాడు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఫస్టాఫ్ మ్యాచ్‌లను చెన్నై, ఢిల్లీ వేదికగా ఆడనుంది. అయితే ఈ రెండు వేదికలు ఆరెంజ్ ఆర్మీకి కలిసొస్తాయని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

'సన్‌రైజర్స్ హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. అంతేకాకుండా ఆ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్‌లో లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటుంది. తద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుకు నిలుస్తుంది. వారి తొలి తొమ్మిది మ్యాచ్‌ల్లో 6 లేదా ఏడు గెలిచే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ ఫస్టాఫ్ మ్యాచ్‌ల వేదికలు వారికి కలిసి రానున్నాయి.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

 కోల్‌కతా చేతిలో..

కోల్‌కతా చేతిలో..

కోల్‌కతాతో జరిగిన సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు సాధించింది. నితీశ్‌ రాణా (56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), రాహుల్‌ త్రిపాఠి (29 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 53) మెరుపులు మెరిపించారు. రషీద్‌ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి పరాజయం పాలైంది.

మనీశ్‌ పాండే (44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 నాటౌట్‌), జానీ బెయిర్‌స్టో (40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) అర్ధ సెంచరీలతో పోరాడినా హైదరాబాద్‌ను విజయతీరానికి చేర్చలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా... కీలకమైన బెయిర్‌స్టో వికెట్‌ను కమిన్స్‌ దక్కించుకొని తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Wednesday, April 14, 2021, 16:44 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X