Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్‌కు కరోనా!

Anrich Nortje Tests Covid Positive A Big Blow For DC

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌ను విజయంతో మొదలుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ కరోనా బారిన పడ్డాడు. ఈ ధనాధన్ లీగ్‌ కోసం కగిసో రబడాతో కలిసి ఆలస్యంగా భారత్‌కు వచ్చిన నోర్జ్.. బీసీసీఐ నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే క్వారంటైన్ పూర్తయిన తర్వాత అతనికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికరంగా ధృవీకరించాల్సి ఉంది.

గత సీజన్‌లో అన్రిచ్ నోర్జ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. రబడా‌తో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. పాజిటీవ్ వచ్చిన నోర్జ్ మరో 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఈ లెక్కన అతను మరో రెండు, మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్లతో గెలుపొంది బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రబడా, నోర్జ్ లేకుండానే ఢిల్లీ గెలుపొందింది. వారి స్థానంలో పేస్ బాధ్యతలు చేపట్టిన అవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ అద్భుత ప్రదర్శన కనబర్చారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 రన్స్ చేసింది. సురేశ్ రైనా(54), మొయిన్ అలీ(36), సామ్ కరన్ (34) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, క్రిస్ వోక్స్ రెండేసి వికెట్లు తీయగా.. అశ్విన్, టామ్ కరన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 190 రన్స్ చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్లు పృథ్వీ షా(72), శిఖర్ ధావన్(85) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. తొలి వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

Story first published: Wednesday, April 14, 2021, 15:00 [IST]
Other articles published on Apr 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+