Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, సీఎస్‌కే ఒక్కటైంది స్వర్గంలో.. తరతరాలుగా తరిగిపోని బంధం వారిది: ఆకాశ్ చోప్రా

Aakash Chopra Says MS Dhoni and Chennai Super Kings is a marriage made in heaven

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభ సీజన్ నుంచి ఆ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. నిషేధానికి గురైన రెండు సీజన్లు మినహా 10 సీజన్లలో సీఎస్‌కేను ముందుండి నడిపించాడు. మహీ సారథ్యంలో మూడు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు.. ఐదుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక అప్‌కమింగ్ సీజన్లో టైటిల్ నెగ్గి నాలుగో టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

అయితే సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ నిష్క్రమణ, ఆటగాళ్లకు కరోనా సోకడం వంటి అనూహ్య పరిణామాలతో ఉక్కిరిబిక్కిరైన ఆ జట్టు.. అన్నిటిని అధిగమించి కెప్టెన్ కూల్ నేతృత్వంలో టైటిల్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ఇలా చెన్నైకి అన్ని తానై నడిపిస్తున్న ధోనీ.. ఈ ఫార్మాట్‌కు గుడ్ బై చెబితే ఆ జట్టు పరిస్తితి ఏందనే ప్రశ్న తలెత్తుంది.

ధోనీ వెళ్లడు..

ధోనీ వెళ్లడు..

అయితే ధోనీ తప్పుకున్నా ఏదో పాత్రలో ఆ జట్టుతోనే ఉంటాడని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ఈ అంశాన్ని విశ్లేషించాడు. అయితే ధోనీ తప్పుకుంటే ఆ జట్టుకు కష్టాలు తప్పవని కూడా చెప్పాడు. ఎందుకంటే అన్నితానై నడిపించిన ధోనీ లాంటి ఆటగాడు మరొకడు దొరకండం కష్టమన్నాడు. ‘ధోనీ లేకుంటే చెన్నై సూపర్ కింగ్స్ సగం శక్తిని కోల్పోయినట్టే. ఆ జట్టు తరఫున ధోనీ ఎలాంటి సేవలందించకుంటే ఇంకా తీవ్రంగా నష్టపోతుంది. ఎందుకంటే జట్టును ధోనీ అలా నడిపించాడు. అలా మరెవరూ చేయలేరు.

స్వర్గంలో కుదిరిన బంధం..

స్వర్గంలో కుదిరిన బంధం..

నా అంచనా ప్రకారం చెన్నై జట్టుకు సారథ్యం వహించే ఏ ఆటగాడికైనా ధోనీ ఆశీర్వాదం ఉండాలి. ఆ కెప్టెన్‌కు అతని రక్షణ అవసరమవుతుంది. ఎందుకంటే ధోనీ, చెన్నైల బంధం స్వర్గంలో నిర్ణయించబడింది. వారిది తరతరాలుగా చెరగని బంధం. అతను తప్పుకున్నా.. ఏదో రూపంలో జట్టుతోనే ఉంటాడు. అంబాసిడర్‌గానో.. మెంటార్‌గానో.. సీఎస్‌కే డగౌట్స్‌లో ఉంటాడని నా అభిప్రాయం. సీఎస్కే‌కు కూడా అతని అవసరం ఉంది.'అని చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక మహీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ప్రాక్టీస్ షురూ..

ప్రాక్టీస్ షురూ..

ఇక అప్‌కమింగ్ సీజన్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ నెట్‌ ప్రాక్టీస్‌ జోరుగా సాగుతుంది. కరోనా బారిన పడిన పేసర్‌ దీపక్‌ చాహర్‌, బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. క్వారంటైన్ సమయంలో ఉన్న డుప్లెసిస్, ఎంగిడి మినహా మిగతా ఆటగాళ్లందరూ సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో ధోనీ.. పియూష్ చావ్లా, రవీంద్ర జడేజా, శార్దుల్‌ ఠాకూర్‌ వంటి బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను చెన్నై సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

ధోనీ వంటి ఫినిషర్ కోసం చూస్తున్నాం.. అలాంటి ఆటగాడుంటే ఇంగ్లండ్‌పై గెలిచేవాళ్లం: ప్యాట్ కమిన్స్

Story first published: Sunday, September 6, 2020, 17:01 [IST]
Other articles published on Sep 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+