Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మన్కడింగ్ రచ్చ.. రికీ పాంటింగ్‌పై విమర్శలు!

Aakash Chopra Says I want to be a fly on the wall when Ricky Ponting and R Ashwin confront each other on Mankading

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌తో మాట్లాడతానని, ఈసారి అలా చేయకూడదని చెబుతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అశ్విన్ చేసిన తప్పు ఏంటో చెప్పాలని, క్రీడా స్పూర్తికి ఎలా విరుద్దమో వివరించాలని భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు కామెంట్ చేస్తున్నారు.

ఎంసీసీ కూడా..

ఎంసీసీ కూడా..

ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఓ అభిమాని పాంటింగ్ విషయాన్ని ప్రస్తావించగా ఆకాష్ చోప్రా బదులిచ్చాడు. ‘ఇదంతా 2019 ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్ల మధ్య ఓ మ్యాచ్‌ సందర్భంగా జరిగింది. అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుండగా బంతి విసరకముందే రాజస్థాన్‌ ఆటగాడు క్రీజు వదలడంతో మన్కడింగ్‌ చేశాడు. తొలుత దాన్ని ఎంసీసీ కూడా సరైంది గానే భావించింది. ఆ తర్వాత తమ అభిప్రాయం మార్చుకుంది.'అని చోప్రా గుర్తుచేశాడు.

నిబంధనల్లో ఉన్నదే కదా..

నిబంధనల్లో ఉన్నదే కదా..

అశ్విన్‌ మన్కడింగ్‌ చేసే ముందు కాస్త ఆగి బెయిల్స్‌ను తొలగించాడని, దాన్ని మూడో అంపైర్‌ ఔట్‌గా నిర్ణయించాడన్నాడు. ఇప్పుడు మన్కడింగ్‌ చేయడం సరైందా కాదా అనే విషయం పెద్ద చర్చగా మారిందన్నాడు. ‘పాంటింగ్‌ లెక్క ప్రకారం బౌలర్‌ అలా ఔట్‌ చేసేముందు ఆ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలి. కానీ.. అది క్రికెట్‌లో భాగమే అయినప్పుడు హెచ్చరించాల్సిన అవసరం ఏముంది. అలాగే అలా ఔట్‌ చేసిన వికెట్‌ను బౌలర్‌ ఖాతాలో వేయాలి. దాన్ని రనౌట్‌గా పరిగణించవద్దు. అప్పుడు ఎంత మంది బౌలర్లు దాన్ని క్రీడాస్ఫూర్తిగా భావిస్తారో చూద్దాం'అని చోప్రా అభిప్రాయపడ్డాడు.

చివరిగా పాంటింగ్‌ అశ్విన్‌తో మాట్లాడేటప్పుడు ఆ గదిలో తాను ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే అశ్విన్‌ కఠినమైన వ్యక్తి అని, ఏదైనా సరైందని భావిస్తే అతడు వెనకడుగు వేయడని చెప్పాడు. ఈ వ్యవహారంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఆసక్తికర సన్నివేశం జరిగే అవకాశం ఉందని తెలిపాడు.

అశ్విన్ తప్పులేదు..

అశ్విన్ తప్పులేదు..

మన్కడింగ్ విషయంలో అశ్విన్ తప్పేం లేదని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే అభిప్రాయపడ్డాడు. ‘ఈ మన్కడింగ్ వ్యవహారంలో అశ్విన్ తప్పులేదు. నిబంధనల్లో ఉన్నందువల్లే అతను అలా చేశాడు. అశ్విన్ బట్లర్‌ను నేరుగా ఏం ఔట్ చేయలేదు. థర్డ్ అంపైర్ సమీక్షించి మరి ఔటిచ్చాడు. ఈ విషయంలో అశ్విన్‌కు క్రీడా స్పూర్తి లేదని విమర్శలు చేయడం అర్ధరహితం'అని భోగ్లే చెప్పుకొచ్చాడు.

అశ్విన్‌ను అలా చేయనివ్వను:

అశ్విన్‌ను అలా చేయనివ్వను:

ఢిల్లీ కోచ్‌గా అశ్విన్‌తో గట్టిగా మాట్లాడతానని, మన్కడింగ్ చేయనివ్వనని పాటింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని హామీ ఇచ్చాడు. 'ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అలాంటి (మన్కడింగ్) తరహా క్రికెట్‌ను ఆడదు. నేను అశ్విన్‌ను కలవగానే అన్నింటి కంటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు. అతనో అద్భుతమైన బౌలర్‌.

మన్కడింగ్ ఘటన జరిగినప్పుడు నేను ఢిల్లీ ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్‌ లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై కచ్చితంగా చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మాత్రం అలాగే భావిస్తాం' అని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు.

టీమిండియా రిటైర్డ్ ఎలెవన్ vs కోహ్లీ సేన మధ్య చారిటీ మ్యాచ్ నిర్వహించవచ్చు కదా: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Sunday, August 23, 2020, 12:46 [IST]
Other articles published on Aug 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+