జిమ్మీ మ్యాచ్ విన్నరా?
‘ముఖ్యమైన విషయం ఎంటంటే కింగ్స్ పంజాబ్ సరైన జట్టుతో ఆడటం లేదు. తుది జట్టులో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ఇదే. అతనికి బదులు ఓవర్‌సీస్ ఆటగాళ్ల కోటాలో జిమ్మీ నీషమ్‌ను ఆడిస్తున్నారు. అటు పవర్‌ప్లే, ఇటు డెత్‌లో అతడు బౌలింగ్ చేయలేడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అతడు మ్యాచ్ విన్నర్ కాదు. నాలుగు, ఐదు స్థానాల్లో భారీ షాట్లు ఆడి గెలిపించలేడు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకుంటున్నారు? గెలిపించలేని ఆటగాడిని ఆడించడం వల్ల లాభమేంటి?' అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.
90 స్ట్రైక్‌రేట్‌తో మ్యాచ్‌లు గెలిపించలేం..
ఈ వ్యాఖ్యలపై జిమ్మీ నీషమ్ తనదైన శైలిలో స్పందించాడు. మాములుగానే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించే జిమ్మీ.. ఆకాశ్ చోప్రాకు కూడా అదే రీతిలో బదులిచ్చాడు. అతని టీ20 గణంకాలను ప్రస్తావిస్తూ గేలి చేశాడు. ‘18.5 యావరేజ్, 90 స్ట్రైక్ రేట్‌తో చాలా మ్యాచ్‌లను గెలిపించలేం'అని చోప్రాను ఎగతాళి చేస్తూ ట్వీట్ చేశాడు. ఇక ఆకాశ్ చోప్రా తన కెరీర్‌లో మొత్తం 21 టీ20లు ఆడి 18.5 యావరేజ్, 90 స్ట్రైక్ రేట్‌తో 334 పరగులు చేశాడు. ఐపీఎల్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 8.8 సగటు, 74.6 స్ట్రైక్‌రేట్‌తో 53 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జిమ్మీ.. ఆకాశ్ చోప్రాను అవహేళన చేశాడు.

అందుకే నన్ను ఏ జట్టు తీసుకోలేదు..
ఇక జిమ్మీ సెటైరికల్ ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా తనదైన రీతిలో బదులిచ్చాడు. చాలా హుందాగా జిమ్మీ నోరు మూయించాడు. తాను సరిగ్గా ఆడలేదు కాబట్టే ఏ జట్టు తీసుకోలేదని, మరొకసారి నోరు తెరవకుండా సమాధానమిచ్చాడు. ‘నువ్వు చెప్పింది నిజమే ఫ్రెండ్. అందుకే ఏ జట్టు నన్ను తీసుకోలేదు. వేరే పని చేస్తుండటంతో నాకు డబ్బు వస్తుంది. నా విశ్లేషణలు, నా క్రికెట్ గణంకాలతో నీకు వచ్చే సమస్యేం లేదనుకుంటున్నా. మిగిలిన మ్యాచ్‌లోనైనా అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నా'అని చోప్రా హుందాగా బదులిచ్చాడు.


Click it and Unblock the Notifications

అంతా 2020 మహత్యం.. ఎన్నడు లేనిది కేన్ మామ కోప్పడడం ఏంది?










