Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే సన్‌రైజర్స్ హైదరాబాద్ బలహీనత: ఆకాశ్ చోప్రా

Aakash Chopra points out the flaws of Sunrisers Hyderabad

న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో యూఏఈకి తరలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ సందడి మొదలైంది. మరో 6 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ ప్రారంభించాయి. మాజీ క్రికెటర్లు కూడా తమ విశ్లేషణలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి చర్చించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆ జట్టు బలహీనతలను తెలియజేశాడు.

ఫినిషర్ లేకపోవడం..

ఫినిషర్ లేకపోవడం..

టాపార్డర్ బలంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరైన ఫినిషర్ లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుందని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ‘సరైన ఫినిషర్ లేకపోవడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రధాన సమస్య. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్, మనీష్ పాండే వంటి స్టార్ ఆటగాళ్లు టాపార్డర్‌లో ఉన్నప్పటికీ.. ఈ నలుగురు తుది జట్టులో ఆడటం కష్టమే. ఒకవేళ ఈ నలుగురులో వార్నర్, బెయిర్ స్టో, విలియమ్సన్ ఆడితే.. రషీద్ ఖాన్, నబీలల్లో ఒక్కరే తుది జట్టులోకి తీసుకోవాల్సి వస్తుంది.'అని చెప్పాడు.

నమ్మదగిన ఆటగాడు..

నమ్మదగిన ఆటగాడు..

మనీష్ పాండే తర్వాత జట్టులో చెప్పుకొదగ్గ భారత బ్యాట్స్‌మెన్ లేకపోవడమే ఈ సమస్యకు కారణమని చోప్రా చెప్పుకొచ్చాడు. ‘మనీష్ పాండే తర్వాత వచ్చే విజయ్ శంకర్, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్‌లలో ఏ ఒక్కరూ నమ్మదగిన ఫినిషర్‌గా పరిగణించలేం. హైదరాబాద్ టాపార్డర్ బలంగా ఉన్నా.. లోయారార్డర్ బలహీనంగా ఉందనేది కాదనలేని సత్యం. గత కొన్ని సీజన్లుగా ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను టాపార్డరే మోసింది'అని చోప్రా గుర్తు చేశాడు.

బెస్ట్ కాంబినేషన్స్ ఉంటేనే..

బెస్ట్ కాంబినేషన్స్ ఉంటేనే..

ఇక గత సీజన్ల మాదిరి బౌలింగ్ బలం కూడా ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు లేదన్నాడు. అలాగే విదేశీ ఆటగాళ్ల ఎంపిక విషయంలోనే ఆ జట్టుకు తలనొప్పులు తప్పవన్నాడు. ఏది ఏమైనా బెస్ట్ కాంబినేషన్స్‌తో బరిలోకి దిగితేనే సన్‌రైజర్స్ సక్సెస్ అవుతుందని అంచనా వేశాడు. ‘సన్ రైజర్స్ హైదరాబాద్ బిల్లీ స్టేన్‌లేక్, ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లను కూడా కలిగి ఉంది. కానీ వీరికి తుది జట్టులో అవకాశం దక్కడం మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వీరికి అవకాశం ఇస్తే నబీ, రషీద్‌లను పక్కన పెట్టాలి. కాబట్టి సమతూకమైన జట్టును ఎంపిక చేయడమే ఆ టీమ్ ముందున్న పెద్ద సవాల్'అని చోప్రా తెలిపాడు.

విలియమ్సన్ డౌట్..

విలియమ్సన్ డౌట్..

ఇక తుది జట్టులో కేన్ విలియమ్సన్‌కు అవకాశం లభించడం డౌటేనని చోప్రా అభిప్రాయపడ్డాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మహ్మద్ నబీ సూపర్ ఫామ్ న్యూజిలాండ్ ఆటగాడి స్థానానికి ఎసరు తెచ్చిందన్నాడు. అంతేకాకుండా దుబాయ్‌‌లో నెమ్మదైన పిచ్‌లు ఎక్కువ కావడంతో స్పిన్నర్లు జట్టులో ఉండటం కీలకమని, నబీ, రషీద్ తుది జట్టులో కొనసాగించక తప్పదన్నాడు. అలాగే టాపార్డర్ కూడా బలంగా ఉండటంతో ఈ సీజన్‌లో విలియమ్సన్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉందన్నాడు.

బ్రాడ్ హగ్ బెస్ట్ ఐపీఎల్ 2020 ఎలెవన్.. ధోనీకి దక్కని చోటు!

Story first published: Sunday, September 13, 2020, 13:55 [IST]
Other articles published on Sep 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+