IPL 2020 సీజన్‌లో ఆర్‌సీబీని ముంచింది అతనే.. రూ.4.4 కోట్లు దండగ: ఆకాశ్ చోప్రా

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13 సీజన్లు పూర్తి చేసుకున్నా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మాత్రం ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. ప్రతీ సీజన్ ముంగిట 'ఈసాల కప్ నమ్దే'అంటూ ఆశలు రేకెత్తించడం ఆ తర్వాత అందరి ఆశలపై నీళ్లు జల్లడం ఆ జట్టుకు అలవాటైపోయింది. బ్యాటింగ్ ఉంటే బౌలింగ్ ఉండదు.. బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ ఉండదన్నట్లు ఆ జట్టు ఆటతీరుంది. ఈ సీజన్‌లో కూడా బెంగళూరు జట్టుకు నిరాశ తప్పలేదు.
ప్లేఆఫ్‌కు చేరి ఎలిమినేటర్ మ్యాచ్‌లో నిష్క్రమించింది. అయితే ఇచ్చిన అవకాశాల్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ఆరోన్ ఫించ్ వృథా చేయడంతో ఆర్‌సీబీ పరాజయాలకు కారణమని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

ఫించ్ చెత్త పెర్ఫామెన్స్..
ఐపీఎల్ 2020 సీజన్‌లో టీమ్స్ పెర్ఫామెన్స్‌పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా విశ్లేషిస్తున్న ఈ మాజీ ఓపెనర్.. ఫించ్ వైఫల్యమే ఆర్‌సీబీ కొంప ముంచిందన్నాడు.
''ఈ సీజన్‌లో బెంగళూరుకు అతిపెద్ద నిరాశ ఆరోన్ ఫించ్. అతన్ని బెంగళూరు భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఎన్నో మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇచ్చింది. ఈ ఆసీస్ ప్లేయర్ నుంచి హిట్టింగ్‌ను ఆశించింది. కానీ నిరాశే మిగిలింది. కొన్ని మ్యాచ్‌లకు అతన్ని తప్పించారనడం భావ్యం కాదు. ఎందుకంటే అతడు 10-12 మ్యాచ్‌లు ఆడాడు.

అవకాశాలన్నీ వృథా చేశాడు..
మొయిన్ అలీ గురించి మాట్లాడితే అవకాశాలు రాలేదని చెప్పొచ్చు. కానీ ఫించ్ విషయంలో అలా అనలేం. పేలవ ప్రదర్శన వల్ల ఫించ్ తుదిజట్టులో చోటు కోల్పోయాడు. అయితే అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్ కూడా విఫలమవ్వడంతో ఫించ్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాల్సి వచ్చింది. ''అయితే అనుభవజ్ఞుడైన ఫించ్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

వారిపై ఒత్తిడి తగ్గేది..
దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు ఫించ్ కూడా రాణించి ఉంటే విరాట్ కోహ్లీ, డివిలియర్స్‌పై ఒత్తిడి తగ్గేది. ఇతర జట్లలో క్వింటన్ డికాక్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా సత్తాచాటారు. కానీ బెంగళూరు జట్టులో అలా జరగలేదు. భారీ మొత్తం వెచ్చించి తీసుకున్న ఫించ్ అంచనాలను అందుకోలేకపోయాడు'' అని చోప్రా అభిప్రాయపడ్డాడు. వేలంలో ఫించ్‌ను బెంగళూరు రూ.4.40 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన ఫించ్ 22 సగటుతో 268 పరుగులు మాత్రమే చేశాడు.
షకీబ్ అల్ హసన్.. గట్ల భయపడతవా? సిగ్గు చేటు.. క్లమాపణలు చెప్పడంపై తస్లీమా నస్రీన్ ఫైర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications