ఆకాష్ చోప్రా ఆల్‌టైమ్ ఐపీఎల్ ఎలెవన్.. కెప్టెన్ ఎవరంటే.?

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఫాంటసీ క్రికెట్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా ఐపీఎల్ ఆల్‌టైమ్ టీమ్‌ను ప్రకటించాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఈ జట్టు 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత బలమైన జట్టుగా పేర్కొన్నాడు. భారత టాప్ ప్లేయర్లతో పాటు ఓవర్సీస్ ప్లేయర్లను ఎంపిక చేసిన ఆకాష్ చోప్రా.. ఆశ్చర్యకరంగా ఒక్క ఆల్‌రౌండర్‌కు కూడా చోటివ్వలేదు. పైగా ఐదుగురి స్పెషలిస్ట్ బౌలర్లను తీసుకున్నాడు.

ఓపెనర్లుగా వార్నర్..
ఇక ఓపెనర్లుగా ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, భారత పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను తీసుకున్న చోప్రా.. మూడు, నాలుగు స్థానాల్లో విరాట్, రైనాలను ఎంపిక చేశాడు. ఈ నలుగురి ఆటగాళ్లకు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున వార్నర్, ముంబై కెప్టెన్‌గా రోహిత్, ఆర్సీబీ నుంచి కోహ్లీ, చెన్నై బ్యాట్స్‌మన్ రైనా పరుగుల మోత మోగించారు.

హిట్టర్లుగా ఏబీడీ..
ఇక పవర్ ఫుల్ హిట్టర్లు ఐదు, ఆరు స్థానల్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను తీసుకున్నాడు. ఈ ఇద్దరు చాలా సందర్భాల్లో తమదైన ఆటతో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించారు. ఇక పరిస్థితులకు తగ్గట్టు ఆడటంతో.. అభిమానులను అలరించడం వీరికి సాటిలేరు. రాయల్ చాలెంజర్స్ తరఫున ఏబీడీ.. చెన్నై సారథిగా ధోనీకి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది.

కెప్టెన్‌గా ధోనీనే..
ఇక ఏమాత్రం సందేహం వ్యక్తం చేయకుండా ఈ స్ట్రాంగెస్ట్ ఆల్‌టైమ్ టీమ్ సారథ్య బాధ్యతలను చోప్రా.. ధోనీకి అప్పగించాడు. వికెట్ కీపర్‌గా కూడా అతన్నే తీసుకున్నాడు. ఇక స్పిన్నర్ల కోటాను భారత వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్, విండీస్ ప్లేయర్ సునీల్ నరైన్‌తో భర్తీ చేశాడు. ఈ ఇద్దరికి క్యాష్‌రిచ్ లీగ్‌లో మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా సునీల్ నరైనా బ్యాట్‌తో కూడా మెరవగలడు. కోల్‌కతా తరఫున అతను ఓపెనర్‌గా కూడా బరిలోకి చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇక 2017 వరకు ముంబై ఇండియన్స్ ఆడిన భజ్జీ.. గత రెండు సీజన్లుగా చెన్నైకు ఆడుతున్నాడు.

ముగ్గురు పేసర్లు..
భారత స్టార్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రీలంక స్టార్ ప్లేయర్ లసిత్ మలింగాలతో పేస్ విభాగాన్ని పూర్తి చేశాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ స్పెషలిస్ట్ బౌలర్లు కావడం విశేషం. ఐపీఎల్‌తోనే వీరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక టీ20 ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్స్ ఎంతో కీలకం కానీ.. చోప్రా మాత్రం ఒక్కరిని కూడా తీసుకోలేదు. ఇక ఆశ్చర్యకరంగా 12వ ఆటగాడిగా గౌతమ్ గంభీర్‌ను.. 13వ ఆటగాడిగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్‌ను ఎంపిక చేశాడు.
ఆకాష్ చోప్రా ఆల్‌టైమ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), హర్భజన్ సింగ్, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, లసిత్ మలింగా, జస్‌ప్రీత్ బుమ్రా
2007 టీ20 ప్రపంచకప్ ఆడకుండా ఆ ఇద్దరిని ద్రవిడ్ ఒప్పించాడు: లాల్‌చంద్ రాజ్‌పుత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications