
అతని వల్ల ఉపయోగం ఏంటి?
‘ప్రధాన విషయం ఎంటంటే కింగ్స్ పంజాబ్ సరైన జట్టుతో ఆడటం లేదు. తుది జట్టులో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు చోటివ్వలేకపోతున్న ఏకైక జట్టు ఇదే. అతనికి బదులు ఓవర్‌సీస్ ఆటగాళ్ల కోటాలో జిమ్మీ నీషమ్‌ను ఆడిస్తున్నారు. అటు పవర్‌ప్లే, ఇటు డెత్‌లో అతడు బౌలింగ్ చేయలేడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అతడు మ్యాచ్ విన్నర్ కాదు. నాలుగు, ఐదు స్థానాల్లో భారీ షాట్లు ఆడి గెలిపించలేడు. మరి అతడిని ఎందుకు తుది జట్టులోకి తీసుకుంటున్నారు? గెలిపించలేని ఆటగాడిని ఆడించడం వల్ల లాభమేంటి?' అని ఆకాశ్ ప్రశ్నించాడు.

షమీ డెత్ బౌలరా?
మహ్మద్ షమీని డెత్ బౌలర్‌గా ఉపయోగించటాన్ని కూడా చోప్రా తప్పుబట్టాడు. అతను టీమిండియాకు తొలి ప్రాధాన్యం ఉన్న డెత్‌బౌలర్ కాదని గుర్తు చేశాడు. షెల్డన్ కాట్రెల్‌తో ముందుగానే బౌలింగ్ చేయించడం కూడా సరైంది కాదన్నాడు. ‘ముంబై ఇండియన్స్‌తో 15 ఓవర్లకు ముందే షెల్డన్ కాట్రెల్ కోటాను పూర్తి చేయించారు. ఇది ఏ రకమైన బౌలింగ్? మరి డెత్‌లో ఎవరితో వేయిస్తారు?కాట్రెల్‌ను మినహాయిస్తే మిగిలింది నీషమ్, కృష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ. టీమిండియాకు కూడా షమీ తొలి ప్రాధాన్య డెత్ బౌలర్ కాదు. అందుకే 20వ ఓవర్‌ను గౌతమ్‌కు ఇచ్చారు. ఈ రోజుల్లో అనుభవజ్ఞులైన సునీల్ నరైన్, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్‌లకు కూడా ఆఖరి ఓవర్ బంతి ఇవ్వడం లేదు కదా? కనీసం ఆ సోయి కూడా లేకుంటే ఎలా' అని చోప్రా ఘాటుగా వ్యాఖ్యానించారు.

చివరి 6 ఓవర్లలోనే 104..
నిజానికి పంజాబ్ బౌలర్లు పొదుపుగానే బౌలింగ్ చేశారు. 14వ ఓవర్ ముగిసే సరికి ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు మూడు వికెట్లుకు 87 పరుగులు మాత్రమే. ఆ తరువాతే గేరు మార్చిన ముంబై ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 104 పరుగులను పిండుకున్నారు. షమీ వేసిన 17వ ఓవర్‌లో 5 పరుగులు మినహా మిగతా 5 ఓవర్లలో బౌలర్లకు చుక్కులు చూపించారు. 15వ ఓవర్‌లో 15 పరుగులు, 16వ ఓవర్‌లో 22, 18వ ఓవర్‌లో 18, 19వ ఓవర్‌లో 19 పరుగులు చేసిన ముంబై బ్యాట్స్‌మెన్.. చివరి ఓవర్‌లో 25 పరుగులు పిండుకున్నారు.

పొలార్డ్, పాండ్యా విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) ధాటిగా ఆడగా... పొలార్డ్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 నాటౌట్), హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) విరుచుకుపడ్డారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓడింది. నికోలస్ పూరన్ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 44) మినహా అంతా విఫలమయ్యారు.
ఓ ఐసీసీ.. ఇదేం డీఆర్‌ఎస్ రూల్? ఎట్టెట్టా.. ఆ సింగిల్ కౌంట్ కాదు? ఇంత అన్యాయమా?


Click it and Unblock the Notifications












