For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్ ఓవర్‌లో అతన్ని ఆడించాలని కామెంట్రీ బాక్స్‌ నుంచి మొత్తుకున్నా: ఆకాశ్ చోప్రా

Aakash Chopra felt KXIP should’ve sent Mayank Agarwal to bat in Super Over

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో రెండో రోజే అభిమానులకు కావాల్సిన మజా దొరికింది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఆధ్యాంత ఉత్కంఠగా సాగి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఓ వైపు మార్కస్ స్టోయినిస్ చెలరేగితే.. మరోవైపు మయాంక్ అగర్వాల్ మైమరిపించే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

ఈ ఇద్దరి పోరాట స్పూర్తికి పరీక్ష పెడుతూ టైగా ముగిసిన మ్యాచ్‌లో.. సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడా రఫ్ఫాడించాడు.! వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి.. చేజారిపోయిన మ్యాచ్‌లో ఢిల్లీకి విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్ వైఫల్యంతోనే పంజాబ్ ఓటమిపాలైందని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు.

మయాంక్‌ను ఎందుకు పంపలేదు..?

మయాంక్‌ను ఎందుకు పంపలేదు..?

సూపర్ ఓవర్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్‌ను కాకుండా కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను పంపించి ఆ జట్టు ఘోర తప్పిదం చేసిందని అభిప్రాయపడ్డాడు. తాను కామెంట్రీ బాక్స్ నుంచి మయాంక్ అగర్వాల్‌ను పంపించాలని మొత్తుకున్నానని తెలిపాడు. ఈ పొరపాటే పంజాబ్‌ ఓటమికి కారణమైందన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన చోప్రా.. పంజాబ్ టీమ్‌మేనేజ్‌మెంట్ తీరును తప్పుపట్టాడు. ‘మ్యాచ్ తమవైపు ఉన్న పరిస్థితుల్లో కింగ్స్ పంజాబ్ చేసిన పనికి నా మదిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడు. కానీ అతన్ని సూపర్ ఓవర్‌లో ఎందుకు పంపలేదో నాకు అర్థం కాలేదు.'అని చోప్రా పేర్కొన్నాడు.

కామెంట్రీ బాక్స్ నుంచి అరిచా..

కామెంట్రీ బాక్స్ నుంచి అరిచా..

పంజాబ్ గెలుపు కోసం ఒంటి పోరాటం చేసిన మయాంక్ అగర్వాల్‌ను కాదని కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మ్యాక్స్‌వెల్‌ను సూపర్ ఓవర్‌లో ఆడించడంపై చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కామెంట్రీ బాక్స్ నుంచి మయాంక్ పంపించాలని అరిచానని కూడా చెప్పుకొచ్చాడు. ‘ మయాంక్‌ను సూపర్ ఓవర్‌లో ఆడించాలని మొత్తుకున్నా. అతనే సూపర్ బ్యాటింగ్‌తో దూకుడుగా కనిపించాడు. కానీ పంజాబ్ మాత్రం విఫలమైన నికోలస్ పూరన్, రాహుల్, మ్యాక్స్‌వెల్‌ను పంపించి మూల్యం చెల్లించుకుంది'అని ఈ భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

బేబీ ఓవర్ చేసారు..

బేబీ ఓవర్ చేసారు..

పంజాబ్ మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయంతో సూపర్ ఓవర్.. కాస్త బేబీ ఓవర్ అయిందని విమర్శించాడు. వారు పంపించిన బ్యాట్స్‌మెన్ కనీసం ఆరు బంతులు ఆడలేకపోయారని, మూడు బంతుల్లోనే చేతులెత్తేసారన్నాడు. రెండు వికెట్లను సమర్పించుకొని సూపర్ ఓవర్‌ను బేబీఓవర్‌గా మర్చాడని అసహనం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ సూపర్ ఓవర్‌ను బేబీ ఓవర్‌గా మార్చింది. మూడు బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నారు'అని చోప్రా కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్ 2020 సీజన్‌లో చోప్రా హిందీ కామెంటేటర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అటు స్టోయినీస్..ఇటు మయాంక్

అటు స్టోయినీస్..ఇటు మయాంక్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్‌లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఓటమి దశ నుంచి గెలుపు ముంగిట నిలిపిన మయాంక్ ఆ లాంఛనాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు.

ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ చెత్త రికార్డు!

Story first published: Monday, September 21, 2020, 16:55 [IST]
Other articles published on Sep 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+