న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ మ్యాచ్ విన్నర్లను అందించలేదా? మరీ రోహిత్, కోహ్లీ, పాండ్యా ఎవరు గంభీర్?

Aakash Chopra dismisses Gautam Gambhir’s opinion of MS Dhoni not giving enough match-winners to India

న్యూఢిల్లీ: టీమిండియాకు తగిన సంఖ్యలో మ్యాచ్ విన్నర్లను అందించడంలో సౌరవ్ గంగూలీలా మహేంద్ర సింగ్ ధోనీ విజయం సాధించలేకపోయాడని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతీసారి ఈ బీజేపీ ఎంపీ ధోనీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. ధోనీకి దాదా గొప్ప ఆటగాళ్లను అందిస్తే.. అతను మాత్రం కోహ్లీకి అలాంటి ఆటగాళ్లను అందించలేకపోయాడన్నాడు.

అయితే తాజాగా గంభీర్ కామెంట్స్‌కు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గట్టి కౌంటరిచ్చాడు. మ్యాచ్ విన్నర్లు అందిచడంలో ధోనీ విఫలమయ్యాడనే ఈ బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తోసిపుచ్చాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చహల్‌‌తో పాటు కోహ్లీ, రోహిత్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఎవరి హయాంలో అరంగేట్రం చేశారని చోప్రా ప్రశ్నించాడు.

దాదా కెప్టెన్సీ సూపర్..

దాదా కెప్టెన్సీ సూపర్..

తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. గంభీర్ వ్యాఖ్యలకు చోప్రా కౌంటరిచ్చాడు. ‘గంభీర్ చెప్పినట్లు సౌరవ్ గంగూలీ టీమిండియాకు చాలా మంది మ్యాచ్ విన్నర్లు అందించాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఫిక్సింగ్ ఆరోపణలతో భారత క్రికెట్‌పై ప్రజల నమ్మకం సన్నగిల్లిన క్లిష్ట పరిస్థితుల్లో జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. జట్టు పగ్గాలు అందుకోవడమే కాకుండా గట్టి పోటీనిచ్చే జట్టుగా, వీదేశాల్లో కూడా గెలిచి టీమ్‌గా తీర్చిదిద్దాడు. టాలెంట్‌ను పసిగట్టడంలో దాదా అద్భుతమైన ప్రతిభావంతుడు.

పోలికే సరికాదు..

పోలికే సరికాదు..

‘నా అభిప్రాయం ప్రకారం, ధోనీ కెప్టెన్సీ టాస్క్ కష్టంతో కూడుకున్నది. వ్యూహాత్మకంగా జట్టును నడిపిస్తూ పూర్తిగా మార్చే శక్తిగల మహీలాంటి వ్యక్తే అవసరం. నా వరకైతే ధోనీ కెప్టెన్సీని ఇతరులతో పోల్చడమే సరైంది కాదు. గంభీర్ చేసిన వ్యాఖ్యలతో నేనైతే ఏకీభవించను. ప్రస్తుతం కోహ్లీకి లభించిన జట్టంతా ధోనీ హాయాంలో రూపుదిద్దుకుందేనని నా ఫీలింగ్'అని చోప్రా తెలిపాడు. ఇక గంగూలీ, ధోనీ ఇద్దరూ భారత క్రికెట్‌కు ఎంతో చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారత క్రికెట్‌లోనే దాదా ఓ విప్లవం తీసుకురాగా.. ధోనీ ఐసీసీ టైటిళ్లీన్నీ అందించాడు.

దాదా కష్టం.. ధోనీ ప్రతి ఫలం..

దాదా కష్టం.. ధోనీ ప్రతి ఫలం..

ఇక సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకునే సమయానికి టీమిండియాకు విజయాన్ని అందించే ఆటగాళ్లకు కొదువలేదని... కానీ ఎం.ఎస్. ధోనీ కెప్టేన్సీ ముగిసే సమయానికి విరాట్ కోహ్లీకి అండగా నిలిచే స్థాయిలో రోహిత్ శర్మ , జస్ప్రిత్ బుమ్రా లాంటి ఆటగాళ్లు తప్ప.. ఎక్కువ ఆటగాళ్లే లేకపోయారని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో గంభీర్ అభిప్రాయపడ్డాడు. దాదా కష్టానికి దక్కిన ప్రతిఫలాలన్నీ ధోనీ అందుకున్నాడన్నాడు.

‘యువరాజ్ సింగ్, వీరేంద్ర సేహ్వాగ్, జహీర్ ఖాన్, హర్బజన్ సింగ్ లాంటి యువ టాలెంట్స్‌ని ప్రోత్సహించి దేశానికి అందించిన ఘనత గంగూలీది. టీమిండియాకు నేతృత్వం వహించిన గొప్ప కెప్టేన్స్‌లోనే ఒకరిగా ధోనీని అభినందిస్తుంటారు. కానీ ఈ విషయంలో గంగూలీ ఎంతో ముందుండగా.. ధోనీ మాత్రం ఎక్కడో వెనకబడిపోయాడు.'అని గంభీర్ విమర్శించాడు.

మూడు నెలల సమయం.. మూడు రంజీ మ్యాచ్‌లు ఇవ్వండి.. మళ్లీ టెస్ట్‌ క్రికెట్‌లో ఇరగదీస్తా: గంగూలీ

Story first published: Friday, July 17, 2020, 16:25 [IST]
Other articles published on Jul 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X