
జట్టు కావాలనుకుంటే..
ధోనీ మళ్లీ ఆడాలనుకుంటే అది తన ఇష్టమని, అతడే నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు. అలాగే భారత జట్టు కూడా అతడిని కావాలనుకుంటే ఐపీఎల్ పెర్ఫామెన్స్‌తో సంబధం లేకుండా తీసుకుంటుందని తెలిపాడు. ఏడాది కాలంగా మహీ క్రికెట్ ఆడలేనందున అతడి ఫామ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని చోప్రా స్పష్టం చేశాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ ఓటమి నుంచి మహీ మైదానంలోకి అడుగుపెట్టని విషయం తెలిసిందే. ఐపీఎల్ కోసం సిద్దమైనా.. కరోనా కారణంగా ఆ టోర్నీ నిరవధికంగా వాయిదాపడింది.

ఎప్పుడూ జరిగినా ఏబీ ఆడుతాడు..
మరోవైపు 2018లో అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేసిన సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ మళ్లీ జట్టులో చేరాలనుకుంటున్నట్లు ఏడాది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై స్పందించిన చోప్రా డివిలియర్స్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని గుర్తుచేశాడు. ఏబీ మళ్లీ దక్షిణాఫ్రికా తరఫున ఆడటం చూస్తారని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరిగినా వచ్చే సంవత్సరం జరిగినా అతడు కచ్చితంగా ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు.

డివిలియర్స్ విధ్వంసం..
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్న డివిలియర్స్.. తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. 3 టీమ్ క్రికెట్ పేరిట సరికొత్త ఫార్మాట్‌కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తెరదీయగా.. ఆ ఫార్మాట్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ 3 టీమ్ క్రికెట్ సాలిడారిటి కప్‌లో ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఇంకా తనలో బ్యాట్ ఝుళిపించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఘనంగా చాటాడు.

జడేజా, పాండ్యాలకు కష్టమే
ఇక అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు ఆడటం డౌటేనని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ‘జడేజ, పాండ్యాలు ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఉండకపోకచ్చు. వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న పాండ్యా కొన్ని నెలల వరకు టెస్ట్ మ్యచ్‌లకు దూరంగా ఉండటానికే ఆస్కారం ఉంది. జట్టులో జడేజా బదులుగా అశ్విన్, కుల్దీప్‌లకు ఎక్కువ ప్రాధాన్యం లభించవచ్చు. కుల్‌దీప్ చివరిసారిగా ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు 3 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి జడేజా కన్నా కుల్దీప్‌కే అవకాశం ఉండవచ్చు'అని ఆకాష్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

పాకిస్థాన్ బ్యూటీ క్రికెటర్‌కు పెళ్లి ఫిక్స్!