
కరాచీ : పాకిస్థాన్ మహిళా క్రికెటర్, మోస్ట్ బ్యూటీపుల్ పేసర్ కైనత్ ఇంతియాజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. గతవారమే తనకు నిశ్చితార్థం అయినట్లు ఈ 28 ఏళ్ల మహిళా క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. జూలై 17న తన నిశ్చితార్థం జరిగిందని ట్వీట్ చేసింది. 'చివరకు.. ఒప్పుకున్నాను. జూలై 17న నాకు కాబోయే భర్త నా వేలికి రింగ్ తొడిగాడు. అల్లాహుముదిల్లా'అని ఇంతియాజ్ తన ట్వీట్‌లో పేర్కొంది.
బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే కైనత్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతీ విషయంపై స్పందిస్తుంది. దీంతో ఆమెకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారత్‌లో కూడా ఆమెను ఆరాధించేవారున్నారు. తన ఆట కన్నా అభినయంతోనే ఆమె అభిమానులను సంపాదించుకుంది. అయితే తమ అందాల క్రికెటర్ పెళ్లి అనే విషయాన్ని తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. కైనత్ నూతన జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
కరాచీకి చెందిన కైనత్ 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌తో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాదే బంగ్లాదేశ్‌తో వన్డేల్లోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడిన కైనత్ 9 వికెట్లు తీసింది. 12 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టింది. అయితే జట్టులోకి వస్తూ పోతూ ఉండే కైనత్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో చివరిసారిగా ఆడింది. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో ఆమెకు అవకాశం దక్కలేదు. కానీ మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కైనత్ ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీసింది. ఆ మెగాటోర్నీలో పాక్ ఏడు లీగ్ మ్యాచ్‌ల్లో ఓడి నిష్క్రమించింది.
ఇక ఈ అందాల పేసర్ పునరాగమనం కోసం పరితపిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా పాకిస్థాన్‌లో మార్చి నుంచి ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. పురుషుల జట్టు మాత్రం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.