
రోహిత్ కూడా ఏం చేయలేడు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నా ఈ ఫలితమే ఉండేదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆర్‌సీబీ వైఫల్యాలకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏ మాత్రం కారణం కాదన్నాడు. ‘టీమిండియా టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించకపోతే దేశానికి నష్టం జరుగుతుందని గంభీర్ అంటున్నాడు. ఎందుకంటే రోహిత్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అని చెబుతున్నాడు.

ఇదే టీమ్‌తో టైటిల్ గెలుస్తాడా?
అయితే గంభీర్‌ను ఒకటి అడగాలనుకుంటున్నా. ఇదే ఆర్‌సీబీ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇస్తే.. ఇంతే సక్సెస్ సాధిస్తాడా? ఈ ఐదు టైటిళ్లలో ఒక్కటైనా గెలుస్తాడా? రోహిత్ అద్భుతమైన కెప్టెన్. అతనంటే నాకు ఇష్టమే. కానీ ముంబై ఇండియన్స్ సక్సెస్ స్టోరీని భారత జట్టుతో పోల్చడం ఏంటనేది నా ప్రశ్న. కోహ్లీ జట్టు విఫలమైతే.. అది అతని తప్పిదమా?''అని చోప్రా సూటిగా ప్రశ్నించాడు.

సెహ్వాగ్ కూడా..
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న గంభీర్ డిమాండ్‌ను టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తప్పుబట్టాడు. ‘కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేయాల్సిన అవసరం లేదు. అతను జట్టుకు సారథి మాత్రమే. ఆర్సీబీ వైఫల్యానికి అతనొక్కడే కారణం కాదు. ఆర్‌సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు. టీమిండియాకు కూడా కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. మరి అక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా.? వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మెరుగైన విజయాలు నమోదు చేసింది.'అని సెహ్వాగ్ గుర్తు చేశాడు.

భారత్‌కే నష్టం..
ఇక అవకాశం దొరికితే విరాట్ కోహ్లీపై విరుచుకుపడే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ముంబై టైటిల్ గెలవగా... రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశాడు. వన్డేల్లో లేదా టీ20ల్లో.. కుదిరితే రెండు ఫార్మాట్లలో రోహిత్‌ను కెప్టెన్ చేయాలన్నాడు. ఈ నిర్ణయం తీసుకోకపోతే భారత క్రికెట్‌కే నష్టం జరుగుతుందని ఇటీవలే ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ హెచ్చరించాడు. స్ల్పిట్ కెప్టెన్సీని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గంభీర్ తెలిపాడు.‘రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిస్తే.. కోహ్లీ ఒక్కటి కూడా గెలవలేకపోయాడు. విరాట్ సరైన కెప్టెన్ కాదని అనడం లేదు. కానీ కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో సమాన కాలంపాటు కెప్టెన్లుగా వ్యవహరించారు. నా దృష్టిలో రోహిత్ నాయకుడిగా నిలబడ్డాడు'అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
అందుకే టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు: సౌరవ్ గంగూలీ


Click it and Unblock the Notifications












