న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో షకీబ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ 5గురు ఆటగాళ్లు వీరే!

IPL 2020 : 5 Players Who Can Replace Shakib Al Hasan For SRH In IPL 2020 || Oneindia Telugu
 5 Players who can replace Shakib Al Hasan for SRH in IPL 2020

హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ అయిన షకీబ్ అల్ హాసన్‌పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్‌ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల పాటు ఐసీసీ నిషేధం విధించింది.

అయితే, ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది. దీంతో షకీబ్ అక్టోబర్ 29, 2020 వరకు క్రికెట్‌ ఆడటానికి వీల్లేదు. ఈ నిషేధంతో భారత పర్యటనతో పాటు షకీబ్‌ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్‌లో షకీబ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

18 ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం.. మైదానంలో నువ్వు లేకుండా ఆడటం బాధగా ఉంది: ముష్ఫికర్ భావోద్వేగం18 ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం.. మైదానంలో నువ్వు లేకుండా ఆడటం బాధగా ఉంది: ముష్ఫికర్ భావోద్వేగం

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్‌లో షకీబ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం...

వనిండు హసరంగ

వనిండు హసరంగ

వనిండు హసరంగ ఈ ఏడాది సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20తో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే తన స్పిన్ మాయాజాలాన్ని న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లకు చూపించాడు. శ్రీలంక బౌలర్ అకిలా దనంజయ ఏడాది పాటు బౌలింగ్‌కు నిషేధించబడిన సమయంలో హసరంగ ఆ జట్టుకు ప్రధాన స్పిన్ ఆయుధంగా దొరికాడు. పాకిస్థాన్‌తో జరిగిన సిరిస్‌లో 8 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్ కూడా. 22 ఏళ్ల హసరంగ ఇప్పటివరకు 30 టీ20ల్లో నమోదు చేసిన స్ట్రయిక్ రేట్ 130.87. ఒక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. గాలేలో జన్మించిన హసరంగ సన్‌రైజర్స్ జట్టులో షకీబ్ స్థానాన్ని భర్తీ చేసే ప్రధాన ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు.

నిషేధం ఎఫెక్ట్: ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీకి రాజీనామా చేసిన షకీబ్

ఆండిలే ఫెహ్లుక్వాయో

ఆండిలే ఫెహ్లుక్వాయో

ఆండిలే ఫెహ్లుక్వాయో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికా జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో 11 వికెట్లు పడగొట్టి 33.25 యావరేజితో 133 పరుగులు చేశాడు. దేశవాళీ టీ20ల్లో రాణించకున్నా జాతీయ జట్టులో మాత్రం అంచనాలను అందుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా తరుఫున 23 గేముల్లో ఫెహ్లుక్వాయో 7.87 ఎకానమీతో 29 వికెట్లు సాధించాడు. టీ20ల్లో ఇప్పటివరకు హాఫ్ సెంచరీ సాధించకున్నా.. ఫస్ట్-క్లాస్ మరియు లిస్ట్ ఎ క్రికెట్‌లో 10 హాఫ్ సెంచరీలు కలిపి ఉన్నాడు.

సీన్ విలియమ్స్

సీన్ విలియమ్స్

సీన్ విలియమ్స్ ప్రస్తుతం జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్నాడు. 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 33 ఏళ్ళ వయసులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బులవాయోలో జన్మించిన సీన్ విలియమ్స్ ఇప్పటివరకు 66 టీ20లు ఆడి 22.78 యావరేజితో 1,162 పరుగులు చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన సీన్ విలియమ్స్ 7.10 ఎకానమీతో 50 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇటీవలే సింగపూర్‌ వేదికగా జరిగిన టీ20 ముక్కోణపు సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరిస్‌లో ఆరు వికెట్లు తీయడంతో పాటు వరుసగా 66 మరియు 53 స్కోరులను సాధించాడు.

రెండేళ్ల పాటు నిషేధం: బంగ్లా క్రికెటర్ షకీబ్-బుకీ వాట్సాప్ సంభాషణను విడుదల చేసిన ఐసీసీ

గ్లెన్ మ్యాక్స్‌వెల్

గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఐపీఎల్‌లో భారత అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు గ్లెన్ మ్యాక్స్‌వెల్. మ్యాక్స్‌వెల్ టీ20 స్ట్రయిక్ రేట్ 154.94గా ఉంది. ఇప్పటివరకు 60 టీ20లు ఆడిన మ్యాక్స్‌వెల్ 1576 పరుగులు చేశాడు. టీ20ల్లో మ్యాక్స్‌వెల్ అత్యధిక స్కోరు 145. ఇక, ఐపీఎల్ విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు 69 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 1397 పరుగులు చేశాడు. గతేడాది వరల్డ్‌కప్, యాషెస్ సిరిస్‌లు ఉండటంతో ఐపీఎల్‌ వేలానికి అందుబాటులో లేడు.

బెన్నీ హోవెల్

బెన్నీ హోవెల్

ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐపీఎల్ 2020 వేలంలో బెన్నీ హోవెల్ ఉంటాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో వీరిద్దూర రంగాపూర్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే వచ్చే సీజన్ కోసం నిర్వహించే వేలంలో బెన్నీ హోవెల్‌ను కొనుగోలు చేసే జట్టుకు అతడు పిల్లర్‌ మాదిరి నిలవగలడని డివిలియర్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన బెన్నీ హోవెల్ ఇప్పటివరకు 116 మ్యాచ్‌లు ఆడి 22.19 యావరేజితో 1509 పరుగులు చేయడంతో పాటు 125 వికెట్లు కూడా తీశాడు.

Story first published: Wednesday, October 30, 2019, 16:00 [IST]
Other articles published on Oct 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X