నిషేధం ఎఫెక్ట్: ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీకి రాజీనామా చేసిన షకీబ్

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ అయిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుండి తప్పుకున్నాడు. ఈ మేరకు మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) విడుదల చేసిన ప్రకటనలో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ నుంచి షకీబ్ తప్పుకున్నట్లు పేర్కొంది.
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో షకీబ్ ఉల్ హాసన్ అక్టోబర్ 2017లో చేరాడు. సిడ్నీ, బెంగళూరు వేదికగా జరిగిన రెండు మీటింగ్‌లకు షకీబ్ హాజరయ్యాడు. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు అంపైర్లు ఉంటారు. క్రికెట్‌లో ఉన్న సమస్యలపై చర్చించడానికి ప్రతి ఏటా రెండుసార్లు ఈ కమిటీ సమావేశమవుతుంది.

తదుపరి మీటింగ్ మార్చి 2020లో శ్రీలంకలో
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ తదుపరి మీటింగ్ మార్చి 2020లో శ్రీలంక వేదికగా జరగనుంది. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

షకీబ్‌పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం
రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్‌ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు.

ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పిన షకీబ్
ఈ విషయాలను షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పలేదు. అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది. దీంతో షకీబ్ వచ్చే ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు.

కమిటీ చైర్మన్ మైక్ గాటింగ్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ మైక్ గాటింగ్ మాట్లాడుతూ "కమిటీ నుండి షకీబ్‌ను కోల్పోయినందుకు మమ్మల్ని క్షమించండి. గత రెండు సంవత్సరాలుగా అతను అద్భుతమైన కృష్టి చేస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ సంరక్షకులుగా మేము అతని రాజీనామాకు మద్దతు ఇస్తున్నాం. ఇది సరైన నిర్ణయం అని నమ్ముతున్నాం" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications