
హైదరాబాద్: కొలంబోలోని సారా ఓవెల్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ 1-1తో సమం అయింది. అంతకముందు గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్స్‌లో అలసట: విండిస్‌పై ఆరు వికెట్లు తీయడంపై బుమ్రా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ టామ్ లాథమ్(154), బీజే వాల్టింగ్(105) సెంచరీలతో చెలరేగగా... కొలిన్ గ్రాండ్‌హోమ్(83) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 431/6 వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 70.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో డిక్‌వెలా(51), కరుణరత్నే(21), కుషల్ మెండీస్(20) మినహా మిగితా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ రెండో టెస్టులో 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన టామ్ లాథమ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా... ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బీజే వాల్టింగ్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే, రెండో టెస్టులో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనతను సాధించాడు.
మీరే చూడండి: బంతిని కాదు లియాన్ జారవిడించింది.. యాషెస్ ట్రోఫీని! (వీడియో)
టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున 250 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నేను ఔట్ చేయడం ద్వారా 250 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు మ్యాచ్‌కు ముందు 245 టెస్టు వికెట్లతో ఉన్న టిమ్ సౌథీ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయడంతో ఈ మైలురాయిని అందుకున్నాడు.