2027 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనలిస్టులు వీరే: దిగ్గజ క్రికెటర్ సంచలన జోస్యం!
2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ప్రపంచకప్ సెమీఫైనలిస్టులపై క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఆసీస్ మాజీ ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2027 ప్రపంచ కప్ కోసం తన టాప్-4 సెమీఫైనలిస్ట్ జట్లను ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన జోస్యంలో రెండు బలమైన జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశం లేదని ఆరోన్ ఫించ్ స్పష్టం చేయడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
పాకిస్తాన్, న్యూజిలాండ్‌లకు హ్యాండిచ్చిన ఆరోన్ ఫించ్
ఆరోన్ ఫించ్ ఎంపిక చేసిన ఈ టాప్-4 జాబితాలో ఐసీసీ టోర్నమెంట్లలో అత్యంత ప్రమాదకరమైన జట్లుగా పేరుగాంచిన పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు చోటు దక్కలేదు. 2015, 2019 వన్డే వరల్డ్ కప్‌లలో వరుసగా ఫైనల్స్‌కు చేరడంతో పాటు 2023 ప్రపంచకప్‌లోనూ సెమీఫైనల్స్ వరకు వెళ్లిన న్యూజిలాండ్‌ను ఫించ్ తన సమీకరణాల నుంచి పూర్తిగా పక్కన పెట్టడం విశేషం. అలాగే నిలకడలేని ప్రదర్శన చేసే పాకిస్తాన్ జట్టు కూడా సెమీఫైనల్ రేసులో ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోన్ ఫించ్ ఎంచుకున్న టాప్-4 జట్లు ఇవే!
2027 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ బరిలో నిలిచే అత్యుత్తమ 4 జట్లలో ఆరోన్ ఫించ్ మొదటి స్థానంలో టీమిండియాను నిలిపారు. ఇండియాతో పాటు ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, బలమైన ఇంగ్లాండ్, ఆతిథ్య హోదాను పూర్తిగా ఉపయోగించుకోగల దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకుంటాయని ఆరోన్ ఫించ్ ధీమా వ్యక్తం చేశారు.
అక్టోబర్ 2న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ సమరం
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి రౌండ్లో అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ప్రపంచ కప్‌లోనే అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియంలో జరగనుంది. నవంబర్ 21న జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ కూ కూడా ఈ స్టేడియమే వేదిక కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


