Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Japan Open 2026: 35 నిమిషాల్లో చైనా కోట బ్రేక్: క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!

Japan Open 2026: భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సరికొత్త రికార్డు సృష్టించింది. టోక్యో వేదికగా జరిగిన మహిళ సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్ అయిన చైనా క్రీడాకారిణి హాన్ యూను వరుస గేమ్‌లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఘనంగా ప్రవేశించింది. ప్రస్తుత సీజన్లో ఇదే పీవీ సింధు అత్యుత్తమ ప్రదర్శన. రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు.. తనకంటే ఉన్నత ర్యాంకులో ఉన్న చైనా షట్లర్‌ను కేవలం 35 నిమిషాల్లోనే 21-16, 21-14 తేడాతో ఓడించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చెక్? భారత కెప్టెన్సీపై స్మృతి మంధాన ఓపెన్ టాక్!

మ్యాచ్ ప్రారంభంలో పీవీ సింధు కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ.. మొదటి గేమ్ మధ్యలోకి వచ్చేసరికి పూర్తి ఫామ్ అందుకుంది. కోర్టులో చురుగ్గా కదులుతూ అద్భుతమైన షాట్లతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తొలి గేమ్ ను 21-16తో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ లో కూడా పీవీ సింధు విజృంభించింది. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్ లో ప్రారంభంలోనే 8-0తో భారీ ఆధిక్యం సాధించి.. చివరకు 21-14తో మ్యాచ్ ను ఈజీగా ముగించింది. ఈ విజయంతో హాన్ యూపై పీవీ సింధు తన ముఖాముఖి రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.

Japan Open 2026 Indian Star Shuttler PV Sindhu Crushes World No 5 Han yue to Enter Quarterfinals in 35 minutes

ఈ గెలుపుతో మంచి ఊపుమీదున్న 31 ఏళ్ల పీవీ సింధు క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిని నొజోమీ ఒకుహారాతో తలపడనుంది. నిజానికి రెండో రౌండ్ మ్యాచ్ లో టాప్ సీడ్ అయిన దక్షిణ కొరియా స్టార్ ప్లేయర్ ఆన్ సే-యంగ్ వైదొలగడంతో ఒకహారాకు వాకోవర్ లభించింది. దాంతో ఆమె నేరుగా క్వార్టర్స్ చేరింది. పీవీ సింధు, ఒకుహారాల మధ్య గతంలో అనేక ఉత్కంఠభరితమైన పోరాటాలు జరిగాయి. కాబట్టి ఈ క్వార్టర్ పైనల్ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారనుంది.

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

నెరవేరిన మెస్సీ కల: వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు అర్జెంటీనా!

ఈ టోర్నమెంట్‌లో సింధు ఏకైక భారతీయ ఛాలెంజర్
ప్రస్తుతం జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత్ తరపున పీవీ సింధు ఒక్కతే ఏకైక ఛాలెంజర్‌గా నిలిచింది. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో తనిషా క్రాస్టో, ధ్రువ్ కపిల మిక్స్‌డ్ డబుల్స్ జోడీ నిష్క్రమించడంతో ఇప్పుడు టోర్నమెంట్‌లో సింధు ఒక్కతే మిగిలిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. తనిషా, ధ్రువ్‌ల భారత జోడీ, టాప్ సీడెడ్ చైనా జోడీ అయిన ఫెంగ్ యాన్ జె, హువాంగ్ డాంగ్ పింగ్‌ల చేతిలో 47 నిమిషాల్లో 20-22, 17-21 తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు భారత ఆశలు పీవీ సింధు పైనే ఉన్నాయి.

Story first published: Thursday, July 16, 2026, 15:01 [IST]
Other articles published on Jul 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+