Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2024 రారాజు అల్కరాజ్.. ఫైనల్లో జొకోవిచ్‌పై ఘన విజయం!

ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 6-2, 6-2, 7-6(7-4) తేడాతో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్‌‌కు మరోసారి షాకిచ్చాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ టైటిల్‌ ఫైట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన కార్లోస్ అల్కరాజ్.. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచి జొకోవిచ్‌ను మట్టికరిపించాడు.

తొలి రెండు సెట్‌లను అలవోకగా గెలిచిన అల్కరాజ్.. మూడో సెట్‌లో మాత్రమ చెమటోడ్చాడు. తన అనుభవాన్ని అంతా ఉపయోగించిన జొకోవిచ్.. అల్కరాజ్‌కు చుక్కలు చూపించాడు. మూడో సెట్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడటంతో టైబ్రేక్‌కు దారి తీసింది. ఇందులోనూ ఇద్దరూ నువ్వు నేనా అన్నట్లు పోటీ పడ్డారు. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అల్కరాజ్ జొకోవిచ్‌ను బోల్తా కొట్టించాడు. చివరకు 7-4తో మూడో సెట్‌ను సొంతం చేసుకొని టైటిల్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి వింబుల్డన్ విజేతగా నిలిచాడు.

Wimbledon 2024 Carlos Alcaraz beats Novak Djokovic in straight sets

ఈ ఓటమితో 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవాలని భావించిన జొకోవిచ్ కల చెదిరింది. 24 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్‌ను అధిగమించాలన్న జొకోవిచ్ లక్ష్యం నెరవేరలేదు.

గతేడాది జరిగిన వింబుల్డన్ ఫైనల్స్‌లోనూ ఈ ఇద్దరే తలపడ్డారు. అప్పుడు కూడా అల్కరాజ్.. 1-6, 7-6, 6-1, 3-6, 6-4 తేడాతో విజయం సాధించి తొలి వింబుల్డన్ టైటిల్ అందుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన అల్కరాజ్ నాలుగుసార్లూ విజేతగా నిలిచాడు.

Story first published: Sunday, July 14, 2024, 22:10 [IST]
Other articles published on Jul 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+