Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2023: సంచలన ఫలితం.. రూడ్‌కు షాక్! అజరెంకా దూకుడు

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో మరో సంచలన ఫలితం నమోదైంది. నాలుగోసీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)కు ఊహించని షాక్‌ తగిలింది. రెండో రౌండ్లోనే అతను ఇంటిదారి పట్టాడు. బ్రిటన్ హీరో లియామ్‌ బ్రాడీ..ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ రూడ్‌పై సంచలన విజయం సాధించాడు.

గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్‌ బ్రాడీ 6-4, 3-6, 4-6, 6-3, 6-0తో రూడ్‌ (నార్వే)ను కంగుతినిపించాడు. 53 అనవసర తప్పిదాలు చేసిన రూడ్‌ ఓటమి కొనితెచ్చుకున్నాడు.

ఇతర మ్యాచ్‌ల్లో జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కష్టంగా తొలి రౌండ్‌ దాటాడు. 19వ సీడ్‌ జ్వెరెవ్‌ 6-4, 7-6 (7-4), 7-6 (7-5)తో అన్‌సీడెడ్‌ బ్రౌవర్‌ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించాడు. వావ్రింకా 6-3, 4-6, 6-4, 6-2తో ఇచ్‌వెరీ (అర్జెంటీనా)పై గెలిచాడు. రుబ్లెవ్‌ 6-7 (4-7), 6-3, 6-4, 7-5తో కరాత్సెవ్‌ (రష్యా)పై, హర్కాజ్‌ 6-4, 6-4, 7-6 (7-3)తో చొయిన్‌స్కీ (బ్రిటన్‌)పై విజయం సాధించారు.

Wimbledon 2023:

ఇతర మ్యాచ్‌ల్లో షపవ్‌లోవ్‌ (కెనడా), డిమెనార్‌ (ఆస్ట్రేలియా) జారీ (చిలీ), కార్‌బాలెస్‌ (స్పెయిన్‌), డేవిడోవిచ్‌ (స్పెయిన్‌), కబ్లెర్‌ (ఆస్ట్రేలియా) కూడా ముందంజ వేసారు.

మహిళల సింగిల్స్‌లో బెలారస్‌ స్టార్‌ విక్టోరియా అజరెంకా దూసుకెళ్తోంది. సునాయసంగా మూడో రౌండ్లో ప్రవేశించింది. గురువారం జరింగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో 19వ సీడ్‌ అజరెంకా 6-3, 6-0తో పొడొరోస్కా (అర్జెంటీనా)ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఏస్‌లు సంధించిన అజరెంకా.. 26 విన్నర్లు కొట్టింది.

ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో స్వితోలినా (ఉక్రెయిన్‌), బౌల్టర్‌ (బ్రిటన్‌) విజయం సాధించారు. స్వితోలినా 6-1, 1-6, 6-1తో మెర్టిన్స్‌ (బెల్జియం)ను ఓడించగా.. బౌల్టర్‌ 6-0, 3-6, 6-3తో టొమోవా (బల్గేరియా)పై నెగ్గింది. పదోసీడ్‌ క్రెజికోవా (చెక్‌) టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెండో రౌండ్లో 3-6, 0-4తో ఆండ్రీవా (రష్యా)పై వెనుకబడిన పరిస్థితిలో ఆమె గాయంతో వెనుదిరిగింది.

ఇతర మ్యాచ్‌ల్లో గుల్బిచ్‌ (స్విట్జర్లాండ్‌), తుర్సెంకో (ఉక్రెయిన్‌), నెమియర్‌ (జర్మనీ), కెనిన్‌ (అమెరికా), ఇరినా బెగూ (రొమేనియా), మారియా (బ్రెజిల్‌), మార్టిచ్‌ (క్రొయేషియా), సాస్‌నోవిచ్‌ (రష్యా), వొండ్రూసోవా (చెక్‌), బోగ్డాన్‌ (రొమేనియా) విజయం సాధించారు.

Story first published: Friday, July 7, 2023, 9:34 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+