Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2023: జకోవిచ్, స్వైటెక్ బోణీ.. వీనస్ విలియమ్స్ ఔట్!

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో టాప్ సీడ్ ప్లేయర్లు నొవాక్ జకోవిచ్, ఇగా స్వైటెక్ శుభారంభం చేశారు. వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ అనూహ్యంగా ఆరంభ రౌండ్‌లోనే ఇంటిబాట పట్టగా.. పురుషుల్లో నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌, ఏడో సీడ్‌ రుబ్లేవ్‌, 14వ సీడ్‌ ముసేటి, 17వ సీడ్‌ హుర్కాజ్‌, మహిళల్లో నాలుగో సీడ్‌ పెగులా, ఐదో సీడ్‌ గార్సియా బోణీ కొట్టారు.

24 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డే లక్ష్యంగా వింబుల్డన్‌ బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ తొలి అడుగును ఘనంగా వేసాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో రెండో సీడ్‌ జకోవిచ్‌ 6-3, 6-3 7-6 (7-4)తో పెడ్రో కచిన్‌ (అర్జెంటీనా)ను ఓడించాడు. మూడో సెట్లో తప్ప ప్రత్యర్థి నొవాక్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాడు.

Wimbledon 2023: Novak Djokovic, Iga Swiatek win; Venus, Gauff suffer round-one exit

మరో తొలి రౌండ్‌ పోరులో ఏడో సీడ్‌ రుబ్లెవ్‌ 6-3, 7-5, 6-4తో ఆస్ట్రేలియా స్టార్ పుర్సెల్‌పై విజయం సాధించాడు. గాస్కెట్‌ (ఫ్రాన్స్‌) 3-6, 5-7, 5-7తో కొరెంటిన్‌ మౌటెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. 17వ సీడ్‌ హర్కజ్‌ (పోలెండ్‌) 6-1, 6-4, 6-4తో ఆల్బర్ట్‌ రమోస్‌ (స్పెయిన్‌)పై, గోఫిన్‌ (బెల్జియం) 6-2, 5-7, 6-2, 6-0తో మరోజ్‌సన్‌ (హంగరీ)పై నెగ్గారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ దుమ్మురేపింది. ఈ పోలెండ్‌ క్వీన్ 6-1, 6-3తో లిన్‌ జు (చైనా)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి నుంచి ఆమెకు కనీస పోటీయే లేకపోయింది.

43 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ బరిలో దిగిన మాజీ ఛాంపియన్‌ వీనస్‌ విలియమ్స్‌ తొలి రౌండ్లో 4-6, 3-6తో స్వితోలినా చేతిలో పరాజయం పాలైంది. నాలుగో సీడ్‌ జెసికా పెగులా (అమెరికా) 6-2, 6-7 (8-10), 6-3తో తన దేశానికే చెందిన లారెన్‌ డేవీస్‌పై, అయిదో సీడ్‌ కరోలిన్‌ గార్సియా (ఫ్రాన్స్‌) 6-4, 6-3తో వాలినెట్స్‌ (అమెరికా)పై నెగ్గారు.

రష్యా, బెలారస్‌ క్రీడాకారులపై నిషేధాజ్ఞలు తొలగడంతో ఈ సారి వారు పోటీలో నిలిచారు. నిషేధం కారణంగా గతేడాది వింబుల్డన్‌ ఆడే అవకాశం కోల్పోయిన బెలరాస్‌ ప్లేయర్ అజరెంకా టోర్నీలో శుభారంభం చేసింది. అజరెంకా 6-4, 5-7, 6-4తో యువాన్‌ (చైనా)ను ఓడించింది. 15వ సీడ్‌ సంసొనోవా 6-7 (1-7), 6-7 (4-7)తో అనా బోగ్దాన్‌ (రొమేనియా)ను ఓడించింది.

పురుషుల విభాగంలో గతేడాది రన్నరప్‌‌గా నిలిచిన నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) టోర్నీ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా అతను తప్పుకున్నాడు.

Story first published: Tuesday, July 4, 2023, 8:10 [IST]
Other articles published on Jul 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+