Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wimbledon 2023: సంచలన ఫలితం.. 60 ఏళ్ల తర్వాత అనామక ఛాంపియన్!

లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సంచలన ఫలితం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో నయా ఛాంపియన్ అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మార్కెటా వొండ్రుసోవా 6-4, 6-4 తేడాతో ట్యూనీషియాకు చెందిన జాబెర్‌ను ఓడించింది. ఈ విజయంతో మార్కెటా వొండ్రుసోవా కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది.

వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత ఓ అన్‌సీడెడ్ ప్లేయర్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు జాబెర్‌కు మాత్రం ఫైనల్లో మరోసారి చుక్కెదురైంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఫైనల్‌ పోరులో ఓటమి చవిచూసిన జాబెర్‌ తాజా మ్యాచ్‌లోనూ విఫలమైంది. 28 ఏళ్ల జాబెర్ ఇప్పటికే వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

Wimbledon 2023

భారీ అంచనాలతో జాబెర్ రంగంలోకి దిగినప్పటికీ.. వొండ్రుసోవా జోరు ముందు నిలవలేకపోయింది. సెంటర్‌ కోర్టులో జరిగిన ఈ ఫైనల్‌ పోరులో తొలిసారి అడుగుపెట్టిన వొండ్రుసోవాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తొలిసెట్లో ఆరు పాయింట్లను అవలీలగా కొట్టేసిన వొండ్రుసోవా, రెండో సెట్‌లో మాత్రం కొద్దిపాటి ప్రతి ఘటన ఎదుర్కొన్నా.. తిరిగి పుంజుకుంది.

రెండు సెట్లలోనూ జాబెర్‌ 4 పాయింట్లకే పరిమితం చేసి మ్యాచ్‌తో పాటు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. అంతకుముందు వొండ్రుసోవా ఒకే ఒకసారి ఫైనల్ చేరి ఓటమిపాలైంది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమెకు చుక్కెదురైంది. ఈ ఏడాది జాబెర్‌తో రెండు సార్లు తలపడిన వొండ్రుసావా రెండు సార్లు గెలిచింది.

వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన వొండ్రుసావాకు రూ.25 కోట్ల 29 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుండగా.. రన్నరప్‌కు జాబెర్‌కు రూ.12 కోట్ల 64 లక్షల నగదు పురస్కారం దక్కనుంది.

Story first published: Saturday, July 15, 2023, 21:47 [IST]
Other articles published on Jul 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+